స‌రిలేరు నీకెవ్వ‌రు సూప‌ర్ స‌క్సెస్ అందుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఆ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రొడ్యూస‌ర్ అని సుంక‌ర అనిల్‌రావిపూడికి, మ‌హేష్‌కి టోట‌ల్ టీమ్ అంద‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. అలాగే ఈ సినిమా జ‌ర్నీలో తాను ఎంత‌గానో ఎంజాయ్ చేశాన‌న్నారు. అంతేకాక చాలా నేర్చుకున్నాన‌ని కూడా అన్నారు. అదే విధంగా మ‌హేష్‌తో సినిమా చేయాల‌ని త‌నకు ఎప్ప‌టినుంచో ఉంద‌ని ఆయ‌న ఫ్యాన్స్‌కి న‌చ్చిన‌ట్లు సినిమా తీసినందుకు చాలా ఆనందంగా ఉందంటూ త‌న సోష‌ల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆయ‌న ఫీలింగ్స్ అన్నీ పంచుకున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే మ‌హేష్ బాబు థ‌మ్స్ అప్ మీద మ‌రో కొత్త యాడ్ చేశారు. అది త‌న సోష‌ల్ మీడియాలో పెట్టి ఈ వీడియోని చూడండి నేను ఎంత పెద్ద సాహ‌సం చేశానో అంటూ మెసేజ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం మ‌హేష్.. కొర‌టాల‌శివ‌, చిరంజీవి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో మ‌హేష్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అయితే అందులో ఆయ‌న విల‌న్‌గా క‌నిపిస్తార‌ని కొంద‌రు అంటున్నారు. ఇక మ‌హేష్ చిరు సినిమాలో నటిస్తున్నాడు అన్న వార్త వినగానే ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

 


అయితీ ఈ  చిత్రంలో మహేశ్ ఓ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నారట.  ఈ పాత్రలో మహేశ్ చాలా  కొత్త లుక్‌లో కనిపించనున్నారని దాని కోసం ఆయన చాలా క‌స‌ర‌త్తులు చేస్తూ  శరీరాకృతిని కూడా మార్చుకుంటున్నాడని సమాచారం. ఈ సినిమాలో మహేశ్ పాత్ర సీరియస్‌గా ఉండనుందని, ఓ ముఖ్యమైన సందర్భంలో రానుండడంతో మహేశ్ పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందన్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా మహేశ్ పాత్ర ఈ సినిమాకు మంచి ప్లస్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఇటు మ‌హేష్ ఫ్యాన్స్‌.. అటు చిరు ఫ్యాన్స్ ఇద్ద‌రూ కూడా ఇక ఈ సినిమా విడుద‌ల‌య్యేస‌రికి సోష‌ల్ మీడియా అంతా ర‌చ్చ రచ్చ మాములుగా ఉండ‌ద‌న్న‌మాట‌.  అయితే ఇందులో మ‌హేష్  ఆ పాత్ర కోసం ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నార‌ని స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: