ఈవారం హాలీవుడ్ విశేషాలు ఒకసారి గమనిస్తే. హాలీవుడ్ ఇండస్ట్రీలో బడాబడా ప్రాజెక్టులన్నీ కరోనా వైరస్ వ్యాధి వల్ల ఆపేయటం జరిగింది. కరోనా వైరస్ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో భయాందోళనలు నెలకొనడంతో ఇటువంటి సమయంలో సినిమాలు రిలీజ్ చేయకూడదని హాలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుమూలంగా జేమ్స్ బాండ్ వర్షన్ no time to die ఇంకా మరికొన్ని సినిమాలకు సంబంధించి షూటింగ్ కూడా ఆపేసి కొన్నట్లు సమాచారం. ఇదే తరుణంలో సినిమాలకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేయకూడదని డిసైడ్ అయ్యారట. ముఖ్యంగా చైనా మరియు జపాన్, ఇటలీ, సౌత్ కొరియా వంటి దేశాల వైపు షూటింగ్ జరగకూడదని డిసైడ్ అయ్యారట.

 

ఇదే సమయంలో ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సిన డిస్నీ సినిమా కూడా హాలీవుడ్ ఇండస్ట్రీ ఆపేయటం జరిగింది. ఒకరి నుండి ఒకరికి సోకే వ్యాధి వల్ల ఎక్కువగా సినిమా హాల్లో కూడా వ్యాధి సోకే అవకాశం ఉండటంతో హాలీవుడ్ ఇండస్ట్రీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి టైం లో సినిమాలు రిలీజ్ చేసిన నిర్మాతలు నష్టపోవడం తప్ప ఏమీ మిగలదు అని కరోనా వైరస్ వ్యాధి పూర్తిగా కనుమరుగయ్యాక సినిమాలు రిలీజ్ చేస్తే బాగుంటుందని హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు డిసైడ్ అయినట్లు వార్తలు బాగా వినబడుతున్నాయి.

 

మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినిమా కి సాంగ్ పాడుతోంది. గతంలో యాక్షన్ ఫిలిం xxx రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొనే తాజాగా మరోసారి సింగర్ గా పాట పడుతున్న తరుణంలో ఈ వార్త హైలెట్ వార్తగా నిలిచింది. ఇటీవల దీపికా పదుకొనే ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాలీవుడ్ జర్నీ గురించి అదేవిధంగా హాలీవుడ్ ఇండస్ట్రీలో చేయబోయే ప్రాజెక్టుల గురించి అనేక విశేషాలు తెలియజేయడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే హాలీవుడ్ ఇండస్ట్రీ కరోనా వైరస్ వల్ల చాలా భయాందోళన లో ప్రస్తుతం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: