ఈ వారం కోలీవుడ్ ఇండస్ట్రీ విశేషాలు చూసుకుంటే కోలీవుడ్ నిర్మాతల మండలి స్టార్ హీరోయిన్ త్రిష కి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. విషయంలోకి వెళితే త్రిష చేసిన ఓ పనికి సినీ పరిశ్రమ నుండి ఏకంగా బయటకు బహిష్కరిస్తామని వార్నింగులు వచ్చాయట. అందుకే త్రిష చేసిన పని ఏంటి అని ఆరా తీస్తే...తమిళ సినిమా రంగంలో ఎంత పెద్ద హీరో అయినా సరే ఏ సినిమా అయినా సరే ప్రమోషన్ విషయంలో హీరో హీరోయిన్లు పాల్గొనే ఎగ్రిమెంట్ ముందే నిర్మాతతో జరుగుద్ది. ఒకవేళ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని ఉద్దేశం లేకపోతే నయనతార మాదిరిగా ముందుగానే నిర్మాతతో చెప్పటం జరగాలి.

 

కానీ త్రిష సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి తాను నటించిన  'పరమపదం విళ్లైయాట్టు' సినిమా ప్రమోషన్ కి రాలేదు. అయితే ఈ ఘటన పై నిర్మాతల మండలి ఈసీ మెంబర్ శివ ఆగ్రహం వ్యక్తం చేసారు. తరువాత జరగబోయే కార్యక్రమాల్లో పాల్గొనకపోతే తీసుకున్న పారితోషికంలో సగం వెనక్కి తిరిగి ఇవ్వాలని లేకపోతే మండలి పరంగా చర్యలు తీసుకుంటామని అవసరమైతే సినీ పరిశ్రమ నుండి తొలిగిస్తాం అని గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరిగిందట. ఈ వార్త తమిళ సినిమా రంగంలో హైలెట్ గా అయ్యింది. ఇక మరో వార్త కి వెళ్తే దాదాపు 8 సంవత్సరాల తర్వాత పూజా హెగ్డే తమిళ సినిమా రంగంలో అడుగు పెడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటూ వరుస విజయాలు నమోదు చేసుకుంటున్న పూజా హెగ్డే తాజాగా తమిళ సినిమా రంగంలో కూడా బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

విజయ్ హీరోగా సుధా కొంకర ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయట. ఇక సన్ పిక్చర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో ఆఫర్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న పూజా.. ఈ అవకాశం వస్తూనే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త నిజమే అయితే దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత పూజా హెగ్డే తమిళ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. మరోపక్క స్టార్ హీరోయిన్ రాశిఖన్నా కూడా తమిళంలోనే నటించాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: