తెలుగు సినిమా పరిశ్రమకు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన పండంటి కాపురం సినిమా తో నటిగా ఎంట్రీ ఇచ్చిన సహజ నటి జయసుధ, తొలి సినిమాతో ప్రేక్షకులలో మంచి పేరు దక్కించుకున్నారు. కృష్ణ సతీమణి విజయనిర్మల దగ్గరి బంధువయిన జయసుధ, ఆ తరువాత తన అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ తో మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక ఆ తరువాత నుండి దాదాపుగా అందరు అగ్ర హీరోల సరసన పలు పాత్రల్లో నటించిన జయసుధ, ఆ తరువాత బాలీవుడ్ నిర్మాత నితిన్ కపూర్ ని వివాహమాడారు. ఇక వారిద్దరికీ నీహార్ కపూర్, శ్రేయన్ కపూర్ ఇద్దరు కుమారులు. 

 

అయితే ఇటీవల ఆమె భర్త నితిన్ కపూర్ మరణించడంతో మానసికంగా కొంత కృంగిపోయిన జయసుధ, ఆ తరువాత నుండి మెల్లగా ఆ విషాద ఘటన నుండి బయటపడ్డారు. ఇక ఆమె కుమారుడు శ్రేయన్ పెళ్లి ఇటీవల జరుగగా, నేడు హైదరాబాద్ లో రిసెప్షన్ ఎంతో ఘనంగా జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా ఎందరో సినిమా, రాజకీయ ప్రముఖులు హాజరయిన ఈ పెళ్లి వేడుకలో అందరికంటే ప్రత్యేకత సంతరించుకున్న వ్యక్తి పెళ్ళికొడుకయిన శ్రేయన్ కపూర్. దాదాపుగా ఏడడుగుల ఎత్తు ఉండే శ్రేయన్ ముందు ఎంత పొడుగైన వ్యక్తి అయినా సరే దిగదుడుపే అని చెప్పాలి. 

 

ఇక అతని పెళ్లి వేడుకకు విచ్చేసిన వారిలో చాలా మంది శ్రేయన్ హైట్ చూసి ఆశ్చర్యపోసాగారు. ఇక ఆయన ప్రక్కన నిలబడిన ఆయన సతీమణి సహా అందరూ కూడా చాలావరకు పొట్టిగా కనపడడం జరిగింది. కాగా ఆ పెళ్లి వేడుక తాలూకు ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోలు చూసిన  పలువురు నెటిజన్లు, బహుశా టివి టవర్ కి ఆ పేరు నిన్ను చూసాకే పెట్టి ఉంటారు బ్రదర్ అంటూ శ్రేయన్ హైట్ పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: