ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్‌లో ఉన్నాడ‌నే చెప్పాలి. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం స‌మ్మ‌ర్‌కి విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఆయన వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే...  త్రివిక్రమ్ తో కూడా మూవీ చెయ్య‌డానికి ఎన్టీఆర్ రెడీ అయిన విష‌యం తెలిసిందే. అయితే త్వ‌ర‌లో ఈ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడ‌ని స‌మాచారం. ఐతే ఈ వారం ఎన్టీఆర్ గురించి తెలిసిన అప్‌డేట్ ఏంటంటే... త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ పారితోషకం భారీగా పెంచేశాడట. దాదాపు తన రెగ్యులర్ గా తీసుకునే రెమ్యూనరేషన్ కి ఒకేసారి ఏకంగా 30-40 శాతం పెంచేశాడట.

 

సాధారణంగా ఎన్టీఆర్ 25 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఆర్.ఆర్.ఆర్ కొరకు ఆయన ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఆర్.ఆర్.ఆర్ విడుదల తర్వాత ఖచ్చితంగా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చే అవకాశం కలదు. దీనితో భారీగా త్రివిక్రమ్ సినిమా పై క్రేజ్ ఏర్పడి రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ బిసినెస్ జరగడం ఖాయమ‌ని డిసైడ్ అయిన ఆయ‌న‌.  త్రివిక్రమ్ మూవీ కొరకు దాదాపు 50కోట్ల రెమ్యూనరేషన్ ఎన్టీఆర్ తీసుకుంటున్నాడట. అలాగే ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ మూవీ కొరకు భారీగా ముట్టనుంది. రాజ‌మౌళి చిత్రంలో న‌టిస్తున్నాడంటే చాలు ఆ హీరో రేంజ్ అమాంతం పెరగాల్సిందే అన్న‌ట్లు ఉంది ఈ విష‌యం చూస్తుంటే... గ‌తంలో ప్ర‌భాస్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. బాహుబ‌లి వ‌ర‌కు ప్ర‌భాస్ ఒక రేంజ్ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటే బాహుబ‌లి త‌ర్వాత ఆయ‌న రేంజ్‌ని నిర్మాత‌లు అందుకోవ‌డం కాస్త క‌ష్ట‌మ‌యిపోయింది.

 

దీన్ని బ‌ట్టి ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో రెమ్యూన‌రేష‌న్‌ని పెంచేశాడ‌ట మ‌రి. ఇక హీరోలు ఈ విధంగా రెమ్యూన‌రేష‌న్స్ పెంచుకుంటూ పోతే నిర్మాత‌ల‌కు కాస్త క‌స్ట‌మే మ‌రి. ఇక నిర్మాత‌ల ప‌రిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి అన్న‌ట్లు ఉంది. ఎందుకంటే ఎవ‌రికివారు హీరోలు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా సొంత కుంప‌టి పెట్టుకున్నారు కాబ‌ట్టి పెద్ద‌గా వేరే నిర్మాత కోసం ఆలోచించ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: