నయనతార గురించి అందరికి తెలుసు.  ఆమె సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిన విషయమే.  సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.  అయితే, నయనతార సినిమాలు ఇటీవల కాలంలో కొంత వెనుకబడిపోవడంతో ఆమె సినిమాలకు డిమాండ్ తగ్గింది.  దీంతో సినిమాల ఛాన్స్ కోసం రెమ్యునరేషన్ తగ్గించుకుంది.  నయనతారకు ఉన్న క్రేజ్, ఇప్పుడు రెమ్యునరేషన్ తగ్గించుకోవడంతో వరసగా ఆఫర్లు వస్తున్నాయి.  


దీంతో పాటుగా ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటే బాగుంటుందని అనుకుంటున్నారు.  కానీ, అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.  తప్పదు కాబట్టి దర్శక నిర్మాతలు ఏమి చేయలేకపోతున్నారు.  ఇదిలా ఉంటె గతంలో నయనతార తెలుగులో శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రలో మెప్పించింది.  ఆ పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యింది నయనతార.  


సినిమా తరువాత మరలా అలాంటి పాత్ర చేయలేదు.  కాగా, ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ అలాంటి పాత్ర చేయడానికి రెడీ అయ్యినట్టు తెలుస్తోంది.  ఆ పాత్ర మరేదో కాదు.  మాకుత్తి అమ్మన్ అనే తమిళ సినిమాలో నయనతార అమ్మవారి గెటప్ లో కనిపించబోతున్నది.  ఈ పాత్రపై  కొంతమంది అభ్యంతరాలు తెలిపిన సంగతి తెలిసిందే.  


నయనతార ఇలాంటి పాత్రలు వేయడం ఏంటి అని ప్రశ్నించారు.  కానీ, నయనతార మాత్రం అవేమి పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ పోతున్నది.  ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తోంది.  మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ పూర్తి కావొచ్చు.  ఇకపోతే, ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను నిన్నటి రోజున రిలీజ్ చేశారు.  ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. దర్బార్ తరువాత ఆమె చేతిలో దాదాపుగా అరడజను సినిమాలు ఉన్నాయి.  బాలయ్య బోయపాటి సినిమాలో కూడా నటించబోతున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: