బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. డీ వీ వీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై డీ వీ వీ దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ మన్యం వీరుడు అల్లూరి సీతా రామ రాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్‌ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. రామ్‌ చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్‌ భామ ఒలివియా మోరీస్‌ నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా టాప్‌ స్టార్స్‌ తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో బడ్జెట్ అనుకున్న పరిమితులు దాటేస్తోంది.

 

ముఖ్యంగా షూటింగ్ అనుకున్న సమయం కన్నా చాలా ఆలస్యం కావటంతో బడ్జెట్‌ విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో చిత్ర నిర్మాత నటీనటులను రెమ్యూనరేషన్‌లు తగ్గించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాడట. ఇప్పటికే రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ లు పారితోషికం తగ్గించుకునేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు అజయ్ దేవగన్‌, అలియా భట్‌ లు కూడా తక్కువ పారితోషికానికే పని చేస్తున్నారట.

 

ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ భారీగా జరుగుతోంది. ఇప్పటికే నైజాం హక్కులను దిల్ రాజు భారీ మొత్తానికి సొంత చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవర్సీస్‌ హక్కులు కూడా 70 కోట్ల వరకు ధర పలికినట్టుగా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: