ఈ రోజుల్లో మహిళలు టీవీ సీరియల్స్‌కు ఎంతలా అడిక్ట్ అవుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇంటి పనులు కూడా మానేసి సీరియల్స్ చూస్తూ జీవితాన్ని గడిపేవారు కూడా ఉంటున్నారు. ఇక బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి లెక్క‌కు మిక్కిలిగా సీరియ‌ల్స్ న‌డుస్తున్నాయి.  సినిమా రంగాన్ని మరిపించేలా తెలుగు సీరియల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగు ప్రేక్షకులకు శరవేగంతో దగ్గరవుతుంది ఈ రంగం... కేవలం తెలుగు సీరియల్ రంగంతోపాటు తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో కూడా ఈ రంగానిక మంచి ఆదరణ లభిస్తోంది. కథలోనూ, కథనంలోనూ, లోకేషన్ల విషయంలోనూ, సీరియల్ మేకింగ్ లో భారీతనాన్ని చూపించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సీరియళ్లను నిర్మిస్తున్నారు నిర్మాతలు. 

 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి.. ఈ వారం తెలుగు టాప్ రేటింగ్ సీరియ‌ల్ విష‌యానికి వ‌స్తే.. ఎప్ప‌టిలాగానే కార్తీక దీపం సీరియల్ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. మంచి క‌థ‌, క‌థ‌నంతో సీరియ‌ల్ సాగ‌డంతో బుల్లితెర ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రంథం ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాత్రి ఏడున్నర అయిందంటే చాలు తెలుగింట దాదాపు ప్రతి ఇంటిలోనూ కార్తీకదీపం మొదలవ్వల్సిందే. అంతగా ఈ సీరియల్ కి అడిక్ట్ అయ్యారంటే అతిశయోక్తి కాదు .. ఈ సీరియల్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం సీరియల్స్ అన్నింటిని వెనుకకి నెట్టేసి టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. 

 

ఈ సీరియల్ రేటింగ్స్ దరిదాపుల్లోకి కూడా ఏ షో రేటింగ్స్ రావడం లేదు. కోట్లాది రూపాయల బడ్జెట్ తో ఆర్భాటంగా ఇటీవ‌ల‌ ప్రసారమైన‌ బిగ్ బాస్ రేటింగ్స్ విషయంలో ఓ కుటుంబ కథా సీరియల్ ముందు తేలిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది వాస్తవం అని టీఆర్పీ రేటింగ్స్ చెబుతున్నాయి. ఇక ఈ వారం కార్తీకదీపం సీరియ‌ల్ 13 పాయింట్ల‌కు పైగా గెలుచుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆ త‌ర్వాత ప్లేస్‌లో కోయిల‌మ్మ నిల‌వ‌డం విశేషం. ఈ సీరియ‌ల్ తొమ్మిది పాయింట్ల‌కు పైగా గెలుచుకున్న‌ట్టు తెలుస్తోంది. బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న కోయిలమ్మ సీరియల్‌ రోజుకో ట్విస్ట్‌తో సాగిపోతుంది. సరికొత్త రాగాలను పలిగిస్తున్న ఈ కోయిలమ్మ కథ, క‌థ‌నం ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: