మొన్నీమధ్య వరల్డ్ ఫేమస్ లవర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ మరో డిజాస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన నటన అద్భుతంగా ఉన్నప్పటికీ... వీక్ కథ, ఆ వీక్ కథని సరిగా నడిపించే సత్తా దర్శకుడికి లేకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అలాగే ఏ రొమాంటిక్ సినిమాలో విజయ్ దేవరకొండ నటించినా అందులో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తోందని ప్రేక్షకులు నిరాశ పడుతున్నారు. కాస్త కోప్పడినా... అర్జున్ రెడ్డి ఏ కనపడుతున్నడంటే ఆ సినిమా ప్రభావం ఇప్పటిలో పోదని స్పష్టమవుతోంది. అందుకే విజయ్ ఇక లవ్ సినిమాలు తీయనని ప్రమాణం కూడా చేశాడు. ఇకపోతే ఈ సినిమా ద్వారా ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. వాస్తవానికి ఆమె రక్తంలోనే నటన ఉండటం వలన... ఫస్ట్ సినిమాలోనే తన యాక్టింగ్ టాలెంట్ ను చూపించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది.



ఐతే ప్రస్తుతం వరుస డిజాస్టర్ సినిమా లతో సతమతమవుతున్న హీరో విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా లో హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోని పరిశీలిస్తే రాత్రి సమయంలో నడిరోడ్డు పైన విజయ్ దేవరకొండ ఒక బైక్ పై కూర్చొని ఉండగా... బాలీవుడ్ హీరోయిన్బైక్ ముందు భాగం పై కూర్చుంటుంది. వీరిద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టుకొని రొమాంటిక్ గా చూసుకుంటారు. అయితే, ఆ ఫోటోలో ఉన్నది చుంకీ పాండే కూతురు అనన్య పాండే అని తెలుస్తుంది.



ఈమెతో విజయ్ రొమాన్స్ చేస్తుండగా ఎవరో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోటో తీసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేశాడు. ఐతే, ఇది కేవలం ఫైటర్ సినిమా షూటింగ్ లో ఒక భాగమని తెలుస్తోంది. ఫోటో కాస్త నెట్టింట వైరల్ కావడంతో... సినీ బృందం బాగా కోపంగా ఉందని సమాచారం. సినిమా పూర్తవక ముందే షూటింగ్ కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను లీక్ చేయడమనేది చాలా ఘోరమైన పని అని నెటిజనులు మండిపడుతున్నారు. ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ని అతిధి పాత్రలో నటింపజేయాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారట. మరి మైక్ టైసన్ అందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: