కొన్ని కొన్ని సినిమాలు ఎంత బాగా తీసినా, సినిమాల్లో ఎమోషన్స్ ఎంత బాగా పండినా ఆ సినిమాలు సరిగ్గా ఆడవు.  దీనికి కారణం సినిమాని జనాల్లోకి సరిగ్గా తీసుకెళ్ళకపోవడమే. అలాగే కొన్ని సినిమాలు యావరేజ్ గా అనిపించినా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. దీనికి కారణం ఆ సినిమా గురించి జనాల్లో ఇంట్రెస్ట్ కలిగించడమే.. సినిమా స్టార్ట్ అవడం మొదలుకుని రిలీజ్ వరకు ఈ ప్రమోషన్లలో ఎవరైతే కొత్తదనం చూపించి తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళగలరో వారికే విజయం లభిస్తుంది.

 

 

అలా అని కేవలం ప్రమోషన్ తోనే సినిమాలు ఆడవు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఒకానొక పోస్టర్ బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. మొదట్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించి ఆ తర్వత అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు ఇప్పుడు మరో కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ టాలెంటెడ్ యంగ్ యాక్టర్ నీది నాది ఒకే కథ సినిమాలోనూ తనదైన నటనతో విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందాడు.

 

 

ఆ తర్వాత గత ఏడాది బ్రోచేవారెవరురా వంటి డిఫరెంట్ చిత్రంతో వచ్చి హిట్ దక్కించుకుని తను చేసే చిత్రాలలో ఏదో ప్రత్యేకత కనబడేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీ విష్ణు నటిస్తున్న రాజ రాజ చోర అనే సినిమా పోస్ట్ర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో శ్రీవిష్ణు రాజావారి వేషంలో ఉండి నెత్తిన కిరీటం గాల్లో ఎగిరిపోతుంటే పరుగెత్తుతూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ఆద్యంతం చాలా ఆసక్తిగా ఉండడంతో అందరి చూపు అటువైపే పడింది.

 

 

 ఇప్పుడు ఈ పోస్టర్ బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ పోస్టర్ తోనే సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేశాడు. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు తీసే శ్రీవిష్ణు ఈ సారి ఎలాంటి కథతో వస్తున్నాడో..

మరింత సమాచారం తెలుసుకోండి: