ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చే ఏడాది వరకూ ఎన్ని సినిమాలు వచ్చినా.. వస్తున్నా అందరి దృష్టి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీస్టారర్ పైనే ఉంటుందనేది వాస్తవం. టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి ఆర్ఆర్ఆర్ టైటిల్ ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తిస్థాయి టైటిల్ పై యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం.

 

 

రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్ వైపు టీమ్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల కధాంశంతో తీస్తున్న సినమా కావడంతో ఈ టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారట. ఈ టైటిల్ అయితే ఫ్యాన్ వార్స్ కూడా ఉండవని అంటున్నారు. గాంధజీ ద్వారా రఘుపతి రాఘవ రాజారాం పేరు ప్రసిద్ధి పొందింది. విడుదలవుతున్న ప్రతిభాషలోనూ ఓ టైటిల్ పెడతామని ముందే ఫిక్సయ్యారు మేకర్స్. సినిమాకు టైటిల్ సూచించాలంటూ సోషల్ మీడియాలో ఓ కంటెస్ట్ కూడా పెట్టారు. ఎందరో సినీ అభిమానులు పలు పేర్లు సూచించారు కూడా. కానీ.. ఇప్పుడు సినిమా యూనిట్ ఈ టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. 

 

 

తెలుగులోనే ఈ టైటిల్ ఉంచుతారా.. అన్ని లాంగ్వేజెస్ కు ఈ టైటిలే ఉంచుతారా అనేది తెలియాల్సి ఉంది. ఈ నెలలోనే సినిమా గురించి అప్డేడ్ ఉంటుందని ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి సోషల్ మీడియాలో హింట్ కూడా వచ్చింది. పైగా రామ్ చరణ్ బర్త్ డే కూడా ఈ నెలలోనే ఉంది. దీంతో.. టైటిల్ నిర్ణయంపై సినిమా యూనిట్ నుంచి అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న ఈ మూవీ విడుదల కానుంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: