గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న 26వ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియా లో హంగామా అవుతున్న విషయం తెల్సిందే. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం అధికారిక ప్రకటన కోసం ఎదురుచూసారు. ఇక కొద్దీ సేపటి క్రితం ఈఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. రేపు సాయంత్రం 5గంటలకు ఈ ఫస్ట్ లుక్ విడుదలకానుంది. ఇంతకుముందు ఈసినిమా నుండి లీకైన పవన్ పిక్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. మరి రేపు ఈ ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో  రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లోజరుగుతుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా సాలిడ్ సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. దాంతో ఈసినిమా కు లాయర్ సాబ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈరీమేక్ ను డైరెక్ట్ చేస్తుండగా  యంగ్  హీరోయిన్లు అంజలి, నివేత థామస్ మల్లేశం ఫేమ్ అనన్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మే లో విడుదలకానుంది.  

 

ఇక ఈ సినిమాతోపాటు పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి తో  తన 27వ చిత్రాన్ని చేస్తున్నాడు. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్  కూడా స్టార్ట్ అయ్యింది. 100కోట్ల బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ట్స్ అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో నటించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: