తారలు అంతా కలిసి జయసుధ కుమారుడి రెసెప్షన్ కి హాజరు అయ్యారు. అయితే జరిగి రిసెప్షన్ లో అంతా కలిసి సందడి చేసారు. ప్రముఖ సినీ నటి, సీనియర్ హీరోయిన్  జయసుధ పెద్ద కుమారుడు  నిహార్ వివాహ రెసెప్షన్ ఘనంగా జరిగింది. ఎంతో మంది సినీ నటులతో రెసెప్షన్ మంచి సందడి తెచ్చింది.
 
 
IHG
 
హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్ లో శనివారం రెసెప్షన్ విందు  కి ఎందరో మంది హాజరు అయ్యారు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ నటులు కూడా విచ్చేసారు. అలానే పలు రాజకీయ నాయకులు కూడా హాజరై నూతన దంపతులు అయిన నిహార్, అమృత్ ని ఆశీర్వదించారు. అలానే వివాహం కూడా ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది అని కూడా తాజాగా వినిపిస్తున్న విషయమే. ఢిల్లీలో ఈ పెళ్ళి జరిగింది. ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్‌తో జయసుధ తనయుడు నిహార్‌ వివాహం  ఫిబ్రవరి 26న ఢిల్లీలో గ్రాండ్‌గా పెళ్ళి జరిగింది.
 
 
నటి జయసుధకి ఇద్దరూ కుమారులు. నిహార్ కపూర్, శ్రేయాన్ కపూర్. నిహారే పెళ్ళి కొడుకు. చిన్న కుమారుడు అయిన శ్రేయన్ కపూర్ బస్తీ సినిమాతో పరిచయం అయ్యాడు. కానీ బస్తీ అంత పెద్ద హిట్ కాలేదు అలానే అంత మంచిగా ఆకట్టు కోలేదు శ్రేయన్. 
 
 
IHG
 
ఈ వివాహానికి మన సూపర్‌స్టార్‌ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ దంపతులు, నాగార్జున,అమల, జాకీష్రాఫ్, కృష్ణంరాజు గారి సతీమణి శ్యామల, మోహన్‌బాబు,  రాజశేఖర్ జీవిత  టి. సుబ్బిరామిరెడ్డి,  రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, రెడ్డి భరద్వాజ, రాజమౌళి. ఇలా ఎందరో సినీ నటుల మధ్య జయసుధ కొడుకు రిసెప్షన్ ఘనంగా జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి: