తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి పేరు కూడా ఖ‌చ్చితంగా ఉంటుంది. అందంతో పాటు అభినయం కూడా కనబరిచే ఈ బ్యూటి.. బిగ్‌ బాస్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఓ వైపు టీవీ షోలో అలరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. ఇప్పటికే జులాయి, నేను శైలజ, జెంటిల్‌మన్‌ వంటి ఎన్నో చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న ఈ భామ‌.. ఎన్నో షోలను హోస్ట్ చేస్తూ సత్తా చాటుతోంది.

 

దీంతో టెలివిజన్‌లో ఆమె వన్ ఆఫ్ ది టాప్ యాంకర్‌గా నిలిచింది. ఇక మొద‌ట్లో కాస్త ప‌ద్ద‌తిగానే ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ర‌చ్చ చేస్తుంది. ఒక్కో ప్రోగ్రామ్‌కు లక్షల వరకు రెమ్యూనరేషన్స్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి తగ్గట్లే ఇప్పుడు అందాల డోస్ కూడా పెంచేస్తుంది శ్రీముఖి. ఇంతకీ ఈ రాములమ్మ ముచ్చట ఇప్పుడెందుకొచ్చింది అంటే.. ఇప్పుడు శ్రీముఖితో జెమినీ టీవీ వారు ఒక సరికొత్త గేమ్ షో ను ప్లాన్ చేసారు. “సెలెబ్రెటీ కబడ్డీ లీగ్” పేరిట మొదలు కాబోతున్న ఈ షోకు శ్రీముఖినే యాంకర్ గా చేస్తోంది. 

 

కానీ ఈ షో ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేదే తెర‌పైకి వ‌చ్చిన‌ ప్రశ్న. ఎందుకంటే.. జెమినీ ఛానెల్లో ప్రసారం అయ్యే షోలకు పెద్దగా రెస్పాన్స్ రాదని అందరికీ తెలుసు.పైగా ఇది రెండు రోజులు అందులోను గురు మరియు శుక్రవారం రాత్రి 9:30 గంటలకు అని చెప్తున్నారు. ఆ టైమ్‌లో బుల్లితెర ప్రేక్ష‌కులు ఏ షోస్‌కు ఎక్కువ‌గా ప్రేయార్టి ఇస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలోనే సెలెబ్రెటీ కబడ్డీ లీగ్ షో విష‌యంలో శ్రీ‌ముఖి స‌క్సెస్‌ అవుతుందా.. లేదా.. అన్న‌ది హాట్ టాపిక్‌గా అయింది. మ‌రి అది తెలియాలంటే మిస్ కాకుండా మార్చ్ 5న ఈ షో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: