జబర్దస్త్ లో కమెడియన్ కి ఎంత పాపులారిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై భారీ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంటారు  జబర్దస్త్ కమెడియన్స్. కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా ఎన్నో రియాల్టీ షోలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఇక పలు ఈవెంట్ లలో  కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే అక్కడ అక్కడ జబర్దస్త్ కమెడియన్స్ కి కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లేడీ గెటప్ లో ఉన్న కమెడియన్స్ అయితే ఈ ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జబర్దస్త్ కమెడియన్స్ లేడీ గెటప్ వేస్తే నిజంగా ఆడవాళ్లు కూడా వాళ్ల ముందు పని చేయరేమో  అన్నంతగా అందంగా కనిపిస్తారు. ఇలా జబర్దస్త్ లో  లేడీ గెటప్ వేసే వాళ్ళకి కూడా పలు చోట్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది అసభ్యంగా ప్రవర్తించే వాళ్లు కూడా ఉంటారు. 

 

 

 

 ఇప్పటికే సాయి తేజ్ లాంటి కొంతమంది జబర్దస్త్ కమెడియన్ తమకు  కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని చెప్పుకొచ్చారు ఇక తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ జబర్దస్త్ కమెడియన్ అబ్బాయితో కొంతమంది వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. లేడీ గెటప్ లో ఉన్నది చూసి... మిస్ బిహేవ్ చేసారు. ఇంతకీ లేడీ గెటప్ లో ఉన్న ఆ కమెడియన్ ఎవరు అనుకుంటున్నారా.. జబర్దస్త్లో లేడీ గెటప్ లు వేస్తూ ఎంతోమందిని కడుపుబ్బా నవ్విస్తున్న శాంతిస్వరూప్. అప్పట్లో శాంతి స్వరూప్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పి దుమారం రేపిన విషయం తెలిసిందే.

 

 

 ఇక తాజాగా శాంతి స్వరూప్ ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కొంతమంది కుర్రాళ్లు వచ్చి వెనక నుంచి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇక ఆ కుర్రళ్లలో  ఒక యువకుడైతే శాంతి స్వరూప్ తో  దారుణంగా ప్రవర్తించాడు. దీంతో కోపంతో చిర్రెత్తి పోయిన శాంతి స్వరూప్ ఏకంగా చెప్పు కూడా తీసి కొట్టబోయాడు. ఇక చివర్లో ఇది ఫ్రాంక్ అంటూ శాంతిస్వరూప్ ను ఫూల్ చేసారు ఆ యువకులు. ఇక అప్పటి వరకు మాత్రం ఆ యువకులకు శాంతిస్వరూప్ కు  మధ్య డిస్కషన్ మాత్రం ఎంతో సీరియస్గా జరిగింది. ఈ మధ్యలో  శాంతిస్వరూప్ కొన్ని బూతులు కూడా తిట్టేశాడు. అయితే ఈ మధ్య కాలంలో ప్రాంక్ వీడియో లు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. ఏదైనా ఇష్టం వచ్చినట్టు చేయడం ఆ తర్వాత ఫ్రాంక్ అనడం ఈ రోజుల్లో ఎక్కువైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: