తెలుగు ఇండస్ట్రీలో   హీరోల వారసులు హీరోలుగా వస్తున్న సమయంలో కొంత మంది హీరోయిన్లు కూడా వచ్చారు. ఈ కోవలో వచ్చిన హీరోయిన్ శృతి హాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా తెలుగు, హింది, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది.  హీరోయిన్ గానే కాకుండా మంచి సింగర్ గా కూడా పేరు తెచ్చుకుంది.  గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది శృతి హాసన్.  అనారోగ్యం, బ్రేకప్ తదితర కారణాలతో రెండేళ్లు సినిమాలకు దూరమైన హీరోయిన్ శ్రుతీ హాసన్ త్వరలో మళ్లీ వెండితెరపై మెరవనుంది. ప్రస్తుతం మాస్ మహారాజ్ హీరోగా రూపొందుతున్న `క్రాక్` చిత్రంలో నటిస్తుంది శృతి హాసన్. 

 

బలుపు చిత్రం తర్వాత రవితేజతో రెండోసారి నటిస్తుంది. పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘కాటమరాయుడు’ మూవీ తర్వాత తెలుగు సినిమాలు తగ్గించేసింది. దీనికి తోడు శృతి నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్స్ కావడంతో ఈ భామకు ఇటు తెలుగులో కానీ, అటూ తమిళ్‌లోగానీ చిత్రాల్లో అవకాశాలు అంతగా రావట్లేదు.  శృతి గతంలో కొంత కాలం ఓ వ్యక్తితో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ఆమె కొంతకాలంగా డేటింగ్‌ చేసి.. ఆ తర్వాత నుండి విడిపోయింది ఈ జంట. ఇవన్నీ కూడా శృతిని కుంగదీసాయనే అంటారు ఆమె అభిమానులు. దీంతో అడపదడపా చిత్రాల్లో అవకాశాలు వచ్చిన కొన్నింటిని రిజెక్ట్ చేసిందని టాక్. 

 

కొంత కాలంగా శ్రుతి ప్లాస్టిక్ సర్జరీ గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది. దాని గురించి ఇటీవల క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అప్పట్లో తాను కాస్త డిప్రేషన్ లోకి వెళ్లానని ఈ నేపథ్యంలో తనకు విస్కీ అలవాటు అయ్యిందని.. ఒకప్పుడు తాగుతుండేదాన్ని.. అయితే కొన్ని కారణాల వల్ల.. తాగకూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.  ప్రస్తుతం తాను మూవీస్ పై ఫోకస్ పెట్టానని అంటుంది.  దీంతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: