టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ వచ్చిన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా సరే జూనియర్ మాత్రం తాను సొంతగా ఎదగాలని భావించి వరుసగా హిట్స్ తో నందమూరి కుటుంబాన్ని ఒకానొక సందర్భంలో జూనియర్ సినిమాల పరంగా కాపాడాడు అని అతని అభిమానులు అంటూ ఉంటారు. వరుసగా ఫ్లాపులు వచ్చినా సరే జూనియర్ కెరీర్ కి మాత్రం వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ లేదు. 

 

అతనితో సినిమాలు చేయడానికి దర్శకులు ప్రతీ సందర్భంలో పోటీ పడ్డారు అనేది వాస్తవం. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు తారక్. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ళ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు. దసరాకి ఈ సినిమా వస్తుందని భావించినా వాయిదా పడింది. అయితే ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి ఎందరో దర్శకులు పోటీ పడ్డారు. ముఖ్యంగా తారక్ తో సినిమా కోసం చాలా మంది దర్శకులు కథలు రాసుకుని కనీసం అతనికి చెప్పడానికి అయినా ప్రయత్నాలు చేసారు. 

 

కాని తారక్ మాత్రం పెద్దగా వినడానికి ప్రయత్నాలు చేయలేదని అంటున్నారు. కనీసం హైదరాబాద్ కి తమిళనాడు నుంచి ఒక ప్రముఖ దర్శకుడు వచ్చినా సరే కథ వినలేదని టాక్. రాజమౌళి తో సినిమా చేస్తే తనకు ఉన్న క్రేజ్ తో పాటుగా అన్నీ పెరుగుతాయని భావించిన తారక్ కనీసం ఇతర దర్శకులకు అవకాశాలు ఇవ్వలేదని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి అవుతున్న తరుణంలోనే త్రివిక్రమ్ కి అవకాశం ఇచ్చాడట ఎన్టీఆర్. దీనితో కొందరు దర్శకులు ఇప్పుడు అతన్ని అవకాశ వాది అంటూ కామెంట్స్ చేస్తున్నారట. కాగా ట్రిపుల్ ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: