యాంకర్ రవి ఎన్నో షోస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. అలానే రవి తన క్రియేటివిటీతో అందర్నీ బాగా నవ్విస్తాడు. స్టేజ్ పైన స్టెప్స్ వేసి అల్లరి చేస్తూ నవ్విస్తాడు. మంచి డాన్స్ తో గొప్ప ఎంటర్టైన్మెంట్ చేసే ఓ మంచి యాంకర్ మన రవి. అయితే గతంలో ఓ సినిమా కూడా తీసాడు. కానీ అంత పెద్ద స్థానం చేరుకో లేదు ఆ సినిమా.
 
IHG
 
 
అయితే తాజాగా యాంకర్ రవి మాత్రం మంచి సాంగ్ తో ముందుకి వచ్చాడు. అయితే ఆ సాంగ్ ఎంతో చక్కగా ఉండడం నిజంగా ఓ గొప్ప విషయం. ఈ ప్రైవేట్ సాంగ్ తో తనని తాను ప్రూవ్ చేసుకుంటాను అంటూ తన ప్రయత్నం చేసాడు పాటతో. అయితే యాంకర్ రవి మాత్రం చక్కటి సాహిత్యం, మంచి పదాల కూర్పుతో రొమాన్స్ పాట తీసుకుంటూ ముందుకి రావడం నిజంగా ఓ మంచి ప్రయత్నం.
 
 
ఈ పాట లో సమయమే తెలియదే ఏమో ఏమో నీతో ఉంటుంటే.. సమయమే గడవదే ఏమో ఏమో నువ్వే లేకుంటే.. ఇలా ఈ లిరిక్స్ ఎంతో వినసొంపుగా శ్రావ్యంగా రూపొందించడం వల్ల పాట ఎంతో అద్భుతంగా ఉండడం గొప్ప సంగతే. రవి సరసన ముద్దమందారం ఫేమ్ తనూజ  తనతో పాటు ఈ ప్రైవేట్ సాంగ్లో నటించనుంది. 
 
IHG
 
ఈ పాటని హేమ చంద్ర, మౌనిక రెడ్డి వారి గాత్రంతో వినిపించగా, బ్లూరాబిట్ ఎంటర్‌టైన్మెంట్ ఈ అందమైన ప్రేమ గీతాన్ని నిర్మించింది. అలానే సత్య సాగర్ పొలం ఈ పాటని రచించారు. చిట్టి మాస్టర్ కొరియోగ్రఫి చేసారు ఈ పాటకి. ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ పాట హీరో కార్తికేయ చేతుల మీదుగా విడుదల అయ్యింది.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: