''అల్లరి '' నరేష్... ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ తనయడు. ఇది అందరికి తెల్సిన విషయమే. తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రీయేట్  చేసుకున్న అతి కొద్దీ మంది నటుల్లో అల్లరి నరేష్ ఒకరు. తాను మొదటి గా నటించిన ''అల్లరి '' సినిమానే  తన ఇంటి పేరుగా మారిపోయింది. అంతగా తన మొదటి సినిమాతో ఆకట్టుకున్నాడు. తరువాత తాను నటించిన ఏ సినిమా అయినా బాక్సఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేది. నరేష్ ముఖ్యంగా తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన కితకితలు, అత్తిలి సత్తి బాబు, బెండు అప్పారావు, కత్తి కాంతారావు  సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. 

 

కారణం ఈ సినిమాల్లో కామెడీ ఏ చెప్పుకోవాలి. తెలుగు ప్రేక్షకులు మాస్ సినిమాలు చూసి బోర్ కొట్టే టైం లో అల్లరి నరేష్ సినిమాలు ఎంతో అలరించాయి. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వం లో వచ్చిన శర్వానంద్ హీరో గా నటంచిన గమ్యం  సినిమాలో అల్లరి నరేష్ చేసిన పాత్ర గాలి శీను అలా నిలిచిపోయింది. అంతగా తన నటనతో ఆకుట్టుకున్నాడు. ఈ సినిమాలో తన నటనకి ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. అదే విధంగా చాల సినిమాల్లో తన ఏంటో నిరూపించుకున్నాడు. హీరోగా 50కి పైగా సినిమాలు నటించాడు అంటే మాములు విషయంకాదు. 

 

కానీ ఇంతవరకు  బాగానే ఉన్న అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు బాక్సఫీస్ వద్ద అనుకున్నంత గా ఆడట్లేదు. వచ్చిన ప్రతి సినిమా ఎప్పుడు వస్తుందో వెళ్తుందో తెలియడంలేదు, కారణం కామెడీ. ఆ కామెడీ ఏ ఒకప్పుడు ఆకట్టుకున్న ప్రస్తుత తరానికి బోర్ కొడుతుంది అని టాక్. నరేష్ తాను హీరో గా సినిమాలు చేస్తే లాభం లేదు అని మహేష్ నటించిన మహర్షి అనే సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది కానీ  ఈ సినిమా తర్వాత అయినా నరేష్ కెరీర్  ట్రాక్ లో పడుతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఆ అవకాశాలు రావడం లేదు. సినీ వర్గాలు అల్లరి నరేష్ సినీ ప్రస్థానం ముగిసినట్లే అని చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: