కార్తికేయ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చందు మొండేటి ఆ సినిమాతో ఇండస్ట్రీ పెద్దల దృష్టిలో పడ్డాడు. రాజమౌళి కూడా స్పెషల్ గా చందు గురించి ప్రస్థావించాడు. ఇక ఆ తర్వాత ప్రేమం రీమేక్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఆ తర్వాత సవ్యసాచి అంటూ ఓ ప్రయత్నం చేయగా అది కాస్త బెడిసి కొట్టింది. నాగ చైతన్యతో ప్రేమం హిట్ అందుకున్న చందు మొండేటి సవ్యసాచి సినిమా మాత్రం డిజాస్టర్ చేశాడు. ఈ సినిమా కాన్సెప్ట్ ఓకే కాని తెరకెక్కించిన విధానం మాత్రం వర్క్ అవుట్ కాలేదు.

 

ఇదిలాఉంటే సవ్యసాచి ఫ్లాప్ తో వెనుకపడ్డ చందు కార్తికేయ 2 ప్లాన్ చేశాడు. నిఖిల్ హీరోగా వస్తున్న ఈ సినిమా సీక్వల్ కాన్సెప్ట్ కూడా అదిరిపోయేలా ఉంది. దైవం మానుష్య రూపేణా అంటూ ఓ డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు చందు. ఈ ప్రీ టీజర్ చూస్తే చందు అసలు టాలెంట్ ఇదే కాని సవ్యసాచి విషయంలో అతన్ని మిస్ గైడ్ చేసినట్టు చెప్పుకోవచ్చు. మరోసారి తన సత్తా చాటేలా చందు కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు. ఈ టీజర్ చూస్తే తప్పకుండా సినిమాతో చందు హిట్టు కొట్టేలా ఉన్నాడు.

 

కాన్సెప్ట్ తో సినిమాపై ఆసక్తి కలిగించిన చందు తన క్రియేటివిటీ మొత్తం ఈ సినిమాలో చూపించేలా ఉన్నాడు. కార్తికేయ 2 కచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందని ఫస్ట్ లుక్ టీజర్ తోనే చూపించారు. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. చైతు సవ్యసాచి హిట్ కొడితే కింగ్ నాగార్జునతో ఛాన్స్ అందుకుంటాడని అన్నారు. సవ్యసాచి రిజల్ట్ తేడా కొట్టడంతో ఆ ఛాన్స్ మిస్సైంది. నిఖిల్ కూడా కార్తికేయ తర్వాత ఆ రేంజ్ కమర్షియల్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నా వర్క్ అవుత అవట్లేదు. ఈ సినిమా తనకు మంచి హిట్ ఇచ్చేలా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: