టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్, సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ఉన్న సినీ జనాలు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా ఫ్లాప్ అయినా బాలీవుడ్లో ఏకంగా రు. 150 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న జాన్ సినిమా సైతం పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కుతోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ప్రభాస్ 21 వ సినిమా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతుంది.



సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వైజయంతి మూవీస్ బ్యానర్ పై రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వాస్తవంగా చూస్తే ఈ ప్రాజెక్టుకు ప్రభాస్ ఓకే చేయ‌డం వెన‌క అంద‌రూ షాక్ అయ్యారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న అశ్వనీద‌త్ కుమార్తెలు ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్ ప్ర‌భాస్‌ను బుట్ట‌లో ప‌డేయ‌డం వెన‌క చాలా తంతు న‌డిచిందంటున్నారు. ఈ సినిమా కోసం ప్ర‌భాస్‌కు అదిరిపోయే రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ట‌. ప్రభాస్‌కు రు. 50 కోట్లు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా ఇస్తానని ఎర వేశారట.



ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి మార్కెట్ రేంజు ఉంటుంది. పైగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లకు ఆస్కారం ఉంటుంది అన్న నమ్మకంతోనే ప్రియాంక‌, స్వ‌ప్న ఇలా ప్ర‌భాస్‌ను బుట్ట‌లో వేశార‌ట‌. ఈ సినిమాను సైతం తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. స్క్రిప్ట్ కూడా ఫిక్షన్ కావడంతో యూనివర్శల్ గా అంద‌రికి క‌నెక్ట్ అవుతుంద‌న్న భావ‌న‌లోనే ప్ర‌భాస్‌, ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌, నిర్మాత‌లు ఉన్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: