టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టి, హీరోగా తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్, ఆ తరువాత నుండి తన టాలెంట్ తో వరుసగా వస్తున్న అవకాశాలను వినియోగించుకుని ఎందరో అభిమానులను సంపాదించుకుని ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక చరణ్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక  హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్ లో ఒక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

మరొక నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇకపోతే నేడు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పేరు మీద సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రాసిన మెగాస్టార్ ది లెజెండ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు, కాగా హైదరాబాద్ లో ఎంతో వైభవంగా ఈ వేడుక జరిగింది. ఇక ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్, వేదిక వద్దకు చేరుకోగానే అభిమానులందరూ కూడా ఒకటే ఈలలు, గోలలతో హోరెత్తించారు. 

 

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పెంచిన కోర మీసంతో నాచురల్ లుక్ లో వేడుకకు వచ్చిన చరణ్, ఫ్యాన్స్ అందరికీ ఒకసారి అభివాదం చేసారు. కాగా ఈ వేడుకలో మెగాస్టార్ గొప్పతనం గురించి ఎంతో బాగా చెప్పిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు, చివరిలో మాట్లాడుతూ, ఎప్పుడూ చరణ్, చిరంజీవి గారితో సినిమాలు నిర్మించడం కాదు, కాస్త మాకు కూడా అవకాశం ఇవ్వాలి అని అనగానే, సభ మొత్తం కూడా నవ్వులతో మారుమ్రోగింది. ఇక చరణ్ లేటెస్ట్ లుక్ ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: