టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాహుబలి, బాహుబలి - 2 అనే అతిపెద్ద సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్  మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. అయితే.. ఈ సినిమా కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ పెద్ద పెద్ద హీరోలు ఉండటంతో ఈ సినిమాకి ఎక్కువ క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి విషయం సెన్సేషన్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ వార్తలో టైటిల్ పై చర్చ.

 

అయితే ఈ సినిమా టైటిల్‌ ఆర్ఆర్ఆర్‌. కాగా., అసలు ఆర్ఆర్ఆర్‌ అంటే ఏమిటనే దాని పై చిత్ర వర్గాల్లో పలు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆర్ఆర్ఆర్‌కు ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ విషయంలో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌ గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండటంతో ఈ సినిమాకు దేశభక్తిని పెంపొందించే టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ చిత్ర టైటిల్‌ పై ప్రేక్షకులు చేస్తున్న లొల్లికి మరి చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందనే విషయం చూడాల్సిందే అని అంటున్నారు.

 

ఇక ఈ సినిమాకు నిజంగానే ‘రఘుపతి రాఘవ రాజారామ్’ అనే టైటిల్‌ ను పెడతారా లేక వేరే ఏదైనా టైటిల్‌ ను ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, నటి ఆలియా భట్, ఒలివియా మారిస్‌ లు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: