టాలీవుడ్ లో ఓ పాత్ర ద్వారా పాపులర్ అయ్యారంటే వారిలో ఎంతో టాలెంట్ ఉండబట్టే. ఎందరో నటులు తాము సినిమాల్లో పోషించిన పాత్ర తమ ఇంటి పేరుగా మారిపోయింది. అదే పేరును సినిమాల్లో స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నారు. వారిలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా ఉన్నాడు. ఏ ముహూర్తాన కృష్ణవంశీ ఖడ్గంలో ఆ క్యారెక్టర్ ఇచ్చి ఓ మేనరిజమ్ ఇచ్చాడో కానీ అక్కడి నుంచి దాదాపు ఓ 17 ఏళ్లు తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా గత నాలుగేళ్లు ఆయనకు స్వర్ణ యుగమే అని చెప్పాలి.

 

 

అలాంటి పృథ్వీ ఇప్పుడు చాలా కష్ట కాలం ఎదుర్కొంటున్నాడు. సీఎం జగన్ మెప్పు పొంది ఏకంగా తిరుమల ఎస్వీబీసీ చైర్మన్ అయ్యాడు. అంత హోదా వచ్చాక కూడా రాజకీయాలపై స్పందించేవాడు. చివరకు ఓ ఆడియో టేప్ లో తాను మాట్లాడిన మాటలకు ఏకంగా పదవి పోగొట్టుకుని అభాసు పాలయ్యాడు. పదవి పోయాక తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పృథ్వీ స్పందించాడు. ఎస్వీబీసీ చైర్మన్ అయ్యాకే అసలు సిసలు రాజకీయాలు తెలిసాయని వాపోయాడు. తనను పదివి నుంచి దించడానికి ఎన్ని కుయుక్తులు పన్నారో తెలుసుకున్నానన్నాడు. పదవి పోయాక అటు సినిమా పరిశ్రమలో కానీ.. ఇటు పార్టీలో కానీ పలకరించేవారు కరువైపోయారని అంటున్నాడు.

 

 

ప్రస్తుతం తన కుటుంబం చిన్నాభిన్నమైందని కూడా బాధపడుతున్నాడు. సినిమాలతో వచ్చిన క్రేజ్ తో వైసీపీ పార్టీలో చేరి జగన్ కు నమ్మినబంటులా మారాడు. ఎన్నికలకు ముందు పృథ్వీ ఏకంగా పవన్ కల్యాణ్, నాగబాబుపై తీవ్ర విమర్శలు చేసి జగన్ మెప్పు పొందాడు. ఎందరో ఉండగా పృథ్వీకి మంచి అవకాశమిస్తే పోగొట్టుకున్నాడు. ఓ వెలుగు వెలిగిన తర్వాత ఇటువంటి పరిస్థితి రావడంతో పృథ్వీ బాధలు వర్ణనాతీతంగా మారాయి. మరి పృథ్వీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: