పూరి జగన్నాథ్ దర్శకత్వం   అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది బాలీవుడ్ బ్యూటీ హన్సిక.  బాల నటిగా కెరీర్ ప్రారంభించిన హన్సికపూరి జగన్నాథ్  తెరకెకక్కించిన దేశముదురు సినిమాలో గ్లామర్ తో అలరించింది.  ఈ మూవీ అల్లు అర్జున్ ఇటు హన్సిక మంచి పేరు తెచ్చింది.  తర్వాత తెలుగు,  తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన హన్సిక గత కొంతకాలంగా అనుష్కకు పెద్దగా కలిసి రావడం లేదని అంటున్నారు. అయితే ఇటీవల హన్సిక ఎక్కువగా హర్రర్ మూవీ లో నటిస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో కన్నా తమిళంలో హన్సిక ఎక్కువ గా నటిస్తుంది. 

 

ఇండస్ట్రీ అనగానే హీరోయిన్స్ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇలాంటి మార్పులు మరీ ఎక్కువ.  కొత్త హీరోయిన్స్ వస్తే పాత హీరోయిన్లు ఫెడవుట్ అంటూ పక్కన బెడుతుంటారు.  హన్సిక కెరీర్ ఇప్పటికీ పదేళ్లు దాటి పోయింది.  సక్సెస్ పెద్దగా లేవు.. కానీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ మాత్రం ఎక్కడికీ పోలేదు. తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అభిమానుల కోరిక ప్రకారం బాగా బరువు పెరిగి వారికి ఆరాధ్య దేవతైంది. ఎంత ప్రేమ అయినా మున్నాళ్ళ ముచ్చటే అయింది. అక్కడ అవకాశాలు తగ్గడంతో తెలుగు హిందీ మీద దృష్టి పెట్టింది.

 

ఇక్కడి వారికి బొద్దుగుమ్మలు నచ్చరు కనుక సన్నగా మారిపోవడానికి ప్రయత్నించి సక్సెస్‌ అయింది.  హీరోయిన్‌ కెరీర్‌ అలాగే ఉంటుంది. అవకాశాల కోసం ఒక్కోసారి శరీరాన్ని పెంచుకోవాలి. మరోసారి తగ్గించుకోవాలి. ఈ క్రమంలో ముఖంలో వచ్చే మార్పులను పెద్దగా పట్టించుకోరు. సరిగ్గా ఇలాంటి తప్పే చేసి తన కెరీర్‌కే చరమగీతం పాడుకోబోతోంది.  ఇటీవల ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. వాటిల్లో హన్సికను చూసి ఆమె అభిమానులతో పాటు సినీ అభిమానులు షాక్‌ అయ్యారు. ఈ రూపంతో ఉంటే హన్సికకు అవకాశాలు రావనీ, ఆమె పనైపోయినట్టేనని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: