ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని వైద్యులు సైతం చెబుతున్నారు. ఒకప్పుడు ఇంటిల్లిపాదినీ అలరించేలా కుటుంబ కథా చిత్రాలు, హాస్య చిత్రాలు వెండితెరను పలకరించేవి. ముఖ్యంగా జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, ఎస్వీ కృష్ణారెడ్డిలాంటి దర్శకులు హాస్య ప్రధాన చిత్రాలెన్నో తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వాళ్లను దృష్టిలో పెట్టుకునే సినీ రచయితలు కామెడీ ట్రాక్ లు రాసుకునేవారు. 

 

తెలుగు ఇండస్ట్రీలో బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన కామెడీ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే కామిక్ టైం అందరిని ఎంతలా ఆకట్టుకుందో తెలిసిన విషయమే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బావగారు సినిమాతో ఇద్దరికీ మంచి పేరుతో పాటు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. మరలా వాళ్ళు వెనక్కి తిరిగి చూసిందే లేదు. వారిద్దరి మధ్య ఉన్న కామిక్ టైమింగ్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్గుద్దులను చేసుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ, డైలాగ్స్ కి కూడా చాలా ఆదరణ పొందాయి. 

 

బాబు మోహన్ ను కోటా శ్రీనివాసరావు ఒక్క తన్ను తన్నగానే ఆ సినిమాకు కలెక్షన్లు వరదలా వచ్చేవి. వీరిద్దరి కాంబినేషనూ ఉంటే సినిమా హిట్టే అన్న గోల్డెన్ పీరియడ్ నడిచిందంటే అతిశయోక్తి కాదు. పెద్ద జమీందారు, పిల్ల జమీందారుగా, బావా బావమరిదిలో వీళ్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఒక పక్క విలనిజం చూపిస్తూనే మరోపక్క అదిరిపోయే హస్యం అందించారు. 

 

ఇక సాగర్ దర్శకత్వంలో వచ్చిన మామాగారు లో అయితే బాబుమోహన్ ఉండన్నా నీకు మర్యాద చూపిస్తా అంటూ కోటాకు చేసిన మర్యాద ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యేలా చేసింది. ఇప్పటికీ ఏదైనా సినిమా ఫంక్షన్లు జరిగినపుడు వీరిద్దరూ కలిస్తే అన్నాఅంటూ బాబూమోహన్ ఏరా అంటూ కోటా శ్రీనివాసరావు తమ మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: