పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వింటేనే జనాలకి మైకం కమ్మేస్తుంది. ఆయన లో ఉన్న పవర్ అలాంటిది. సినిమా సినిమాకి రేంజ్ ని క్రేజ్ ని పెంచుకున్న పవర్ స్టార్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకి లేని క్రేజ్ ని సంపాదించుకున్నారు. అజ్ఞాతవాసి వరకు ఆయన సినిమాలకున్న క్రేజ్ అసామాన్యం. ఇక పవర్ స్టార్ సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడటానికి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడానికి ఇష్టపడే వాళ్ళు ఉండేవారు కాదు. అంతేకాదు పవన్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడానికి కూడా ఎవరూ ఇష్టపడేవాళ్ళు కాదు. అయితే ఇలా ఒకప్పుడు ఉండేది. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి అనూహ్యంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నందుకు విమర్శించడానికి ఇప్పుడు అంతగా ఎవరూ ఆలోచించడం లేదు.

 

ఆ నేపథ్యంలోనే తాజాగా పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ లుక్ రేపు సాయంత్రం 5 గంటలకు అంటూ.. ఓ అధికారిక పోస్టర్ బైటకొచ్చింది. అయితే ఈ పోస్టర్ లో ఎల్లో కలర్ హైలెట్ కావడం. పసుపు పచ్చ బ్యాక్ గ్రౌండ్ మీద బ్లాక్ లెటర్స్ తో పి.ఎస్.పి.కె 26 వివరాలు తెలియజేశారు. దీంతో పవన్ యాంటీ బ్యాచ్ పనికిమాలిన కామెంట్స్ తో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇన్నాళ్లూ పచ్చబ్యాచ్ తో కలిసి తిరిగిన పవన్ కల్యాణ్.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా పాత ఫ్రెండ్ షిప్ మర్చిపోలేకపోయారంటూ ట్రోల్ చేస్తున్నారు. 

 

ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటిస్తున్నారు కాబట్టి నల్లకోటుకి సింబాలిక్ గా బ్లాక్ లెటర్స్ ని పెట్టారు. అయితే ఆ లెటర్స్ హైలెట్ అవ్వాలంటే తెలుపు, ఎరుపు.. ఇంకేదైనా మిక్స్ డ్ కలర్ కూడా వాడుకోవచ్చుకదా... ఇలా పసుపు పచ్చ బ్యాక్ గ్రౌండ్ వాడడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ కి మన పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ..రివర్స్ లో ఆయన యాంటీ ఫ్యాన్స్ ని చెడుగుడు ఆడేస్తున్నారు.

 

మీరు చేసే పిచ్చి పిచ్చి కామెంట్స్ కి ఆయన ఊరుకుంటారేమో గాని ఆయన డై హార్ట్ ఫ్యాన్స్ గా మేము ఊరుకోమంటు రెచ్చిపోయారు. ఆయన సినిమా పోస్టర్ ని రాజకీయం చేస్తారా ..ఇంక మీకెలా చెప్పాలి ..ఎప్పుడు తెలుసుకుంటారు ..! మౌనంగా మునిలా తన పనేదో తను చేసుకుంటూ వెళుతున్నారు అది బుర్ర బుద్ది ఉన్న వాళ్ళకే అర్థమవుతుందని కామెంట్స్ చేస్తున్నారట. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు అసహనం వ్యక్తం చేస్తున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: