మెగా ఫ్యామిలీ అంటే హీరోలే దాదాపు పది మంది ఉన్నారు ఆ ఫ్యామిలిలో. మెగాస్టర్ చిరంజీవి గారి నుండి వైష్ణవ్ తేజ్ వరకు మెగా హీరోల లిస్ట్ చాలా పెద్దది. ఇంత పెద్ద ఫ్యామిలీ..ఇంత మంది హీరోలు వీళ్ళే. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రాం చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ... ఇలా ఉన్న్ ఈ హీరోల లిస్ట్ లో క్యూట్ గాళ్ నిహారిక చందమామ లా కనిపిస్తుంది. అటు అన్నలతోను, ఇటు నాన్న, డాడి చిరంజీవి తోను చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

 

హీరోలుగా మెగా కుర్రాళ్ళు ఎంతగా పాపులారిటీని సంపాదించుకున్నారో అంతకి ఏమాత్రం తగ్గకుండా మెగా డాటర్ నిహారిక కూడా పాపులారిటీని సంపాదించుకుంది. యాంకర్ గా అల్లరి చేసి బుల్లి తెరమీద సందడి చేస్తుంది. హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ మీద మంచి పేరుని సంపాదించుకుంది. మెగా ఫ్యామిలీలో మెగా డాటర్ కి ఉన్న క్రేజ్ కూడా మామూలుగా లేదు. నిహారిక హీరోయిన్ గా నటించిన సినిమా వస్తుందంటే మెగా ఫ్యామిలీలో సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఫ్యాన్స్ కైతే ఆ ఉత్సాహమే వేరు. వెబ్ సిరీస్ లలోనూ ఈ మెగా డాటర్ సత్తా చాటుతోంది.

 

ఇదంతా ఒక ఎత్తైతే నిహారిక నాన్న కూచి అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. మెగా బ్రదర్ నాగబాబు కి కొడుకు వరుణ్ తేజ్ కంటే కూతురు నిహారిక అంటే కాస్త ఎక్కువ ఇష్టం. ఎంతగా అల్లరి చేసిన ఎంత గోల చేసిన ఒక్కరు నిహారిక ని ఒక్క మాట అనకుండా అందరూ ఎంజాయ్ చేస్తారంటే ఆ అల్లరి ఎలా ఉంటుదో అర్థం చేసుకోవచ్చు. ఇక నిహారిక కి చిరంజీవి పెదనాన్నా అన్న మాటే గాని చిన్నప్పటి నుంచి డాడీ అని పిలవడమే అలవాటు, ఇష్టం. మెగాస్టార్ ఒడిలో పెరిగిన నిహారిక కి చిరు దగ్గర ఉన్న చనువు అంతా ఇంతా కాదు. ఇక బాబాయ్ పవన్ కళ్యాణ్ తో అయితే ఆ రేంజే వేరు. పవన్ కళ్యాణ్ నిహారికతో బాబాయ్ కంటే కూడా ఒక స్నేహితుడిలా ఉంటారన్న విషయం అతి కొద్ది మందికే తెలుసు. ఇంత పెద్ద  మెగా ఫ్యామిలీలో నిహారిక సెంటరాఫ్ అట్రాక్షన్.     

మరింత సమాచారం తెలుసుకోండి: