కొన్నేళ్ల క్రితం ఎంతో మంచి పేరు గాంచిన టాలీవుడ్ హాస్య నట దిగ్గజాల్లో రేలంగి వెంకటరరామయ్య ఒకరు. 13 ఆగష్టు లో రావులపాలెం వద్ద గల రావులపాడు గ్రామానికి చెందిన రేలంగి, చిన్నప్పుడే తల్లి అచ్చయ్యమ్మ మరణంతో ఆపై తండ్రి రామస్వామి చేతులమీదుగా పెరిగారు. ఇక చిన్నప్పటి నుండి సంగీతం, హరికథలు వంటి కళలలో మంచి ప్రావీణ్యం సంపాదించిన రేలంగికి ఎక్కువగా విద్య మీద కంటే నాటకాల మీదనే ద్యాస ఉండడంతో, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక తన మిత్రులతో కలిసి నాట్య మిత్ర మండలిని స్థాపించిన రేలంగి, ఆపై అప్పట్లో మద్రాసు చేరుకొని మెల్లగా దర్శకుడు సి. పుల్లయ్య పరిచయంతో సినిమా రంగంలోకి చిన్న చిన్న పాత్రలతో ప్రవేశించారు. ఇక రేలంగి 1935వ సంవత్సరంలోనే సినిమా రంగంలోకి ప్రవేశించినప్పటికీ, ఆయనకు పూర్తి స్థాయిలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టె పాత్రలు రావడానికి 1948 వ సంవత్సరం వరకు సమయం పట్టింది. 

 

ఇక ఆ తరువాత నుండి వరుసగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగిన రేలంగి, ఎప్పుడూ సెట్ లోని వారందరితో కూడా ఎంతో కలుపుగోలుగా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారట. ఇక అప్పటి అగ్ర నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో మంచి అనుబంధం ఉన్న రేలంగి, అన్న ఎన్టీఆర్ గారిని బావగారు అని ముద్దుగా సంబోదించేవారట. అలానే ఎన్టీఆర్ కు రేలంగి పై మంచి మమకారం ఉండేదట. 

 

ఇక తనకు కొంత వయసు వచ్చిన తరువాత సన్నిహితులతో ఎప్పుడూ రేలంగి రెండు మాటలను మాత్రం చెపుతూ ఉండేవారని, నిజంగా ఆ మాటలు వింటే మనిషి జీవితం అంటే ఏంటో మనకు కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది ఇప్పటికీ కొందరు సీనియర్ నటులు చెపుతూ ఉంటారు. ఎంతటి రాళ్ళనైనా అరాయించుకునే శక్తి గల యుక్త వయసులో ఉన్నపుడు కడుపు నిండా తినడానికి గుప్పెడు మరమరాలు కూడా దొరికేవి కాదట. అదే ఏళ్ళు గడిచి మంచి పేరు ప్రఖ్యాతలు హోదా, డబ్బు, రత్నాలు, వజ్రాలు సంపాదించిన తరువాత మాత్రం, వయసు మీద పడి ఏమీ తినడానికి వీలుండదు సరికదా, అదే మరమరాలు కూడా తిని అరాయించుకునే పరిస్థితి మనకు ఉండదని, అదే మనిషి జీవితం అని ఎప్పుడూ చెప్తుండేవారట.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: