మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా టైటిల్ రివీల్ చేశారు. ఆచార్య అంటూ మెగాస్టార్ చిరంజీవి నోటి నుండే ఆ టైటిల్ వచ్చేసింది. బ్రహ్మాజి తనయుడు హీరోగా నటించిన ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మెగాస్టర్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈవెంట్ లో భాగంగా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆచార్య అంటూ టంగ్ స్లిప్ అయ్యారు చిరంజీవి. అయితే టైటిల్ ఎనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ అంతా విజిల్స్, చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లేలా చేశారు. చిరు కూడా ఫ్లోలో టైటిల్ చెప్పానేంటి అన్నట్టుగా ఒక నిమిషం సైలెంట్ అయ్యారు. కొరటాల శివఈవెంట్ చేసి టైటిల్ ఎనౌన్స్ చేద్దామని అనుకున్నాడని.. తాను టైటిల్ ఇలా రివీల్ చేస్తానని అనుకోలేదని అన్నారు చిరు.

 

అంతేకాదు నిండు సభలో అందరి సమక్షంలోనే కొరటాల శివకు సారీ కూడా చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. స్టార్ సినిమా అంటే ఆ బజ్ వేరేలా ఉంటుంది. ఖైది నంబర్ 150, సైరా సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా టైటిల్ పై రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా చిరు వల్ల టైటిల్ ఆచార్య అని ఫైనల్ అయ్యింది. ఈమధ్య సినిమాలో మహేష్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అది కూడా నిజమే అని తెలిస్తే చిరు 152వ సినిమా సంచలనం సృష్టించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

 

ఈమధ్యనే ఆ సినిమా వర్కింగ్ స్టిల్స్ లీక్ అవగా అందులో చిరు నెక్సలైట్ లుక్ లో అదరగొట్టారు. ఆ స్టిల్స్ చూసి మెగా ఫ్యాన్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచుకున్నారు. మెగా ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివ తప్పకుండా చిరుతో సెన్సేషనల్ హిట్ అందుకుంటాడని అంటున్నారు. మరి సినిమా టైటిల్ ఆచార్య అని తెలియగా మిగతా డీటైల్స్ అని త్వరలో తెలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: