టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతోంది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ విలక్షణ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఓ పిట్ట కథ’ మూవీ ఈ వారం విడుదల కాబోతోంది.


ఈ మూవీని ప్రమోట్ చేస్తూ సంజయ్ రావ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. వాస్తవానికి ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయం అవుతున్న ఈ యంగ్ హీరో బాలనటుడుగా అవ్వాలని నాగార్జున నిర్మించిన ‘లిటిల్ సోల్జర్స్’ ఆడిషన్ కు వెళ్ళి ప్రయత్నించినా అప్పుడు అవకాశం రాలేదు.


అయితే అప్పటి నుండి నటన పై విపరీతమైన ఆసక్తి పెరగడంతో నటుడుగా మారాలని అప్పట్లోనే నిశ్చయించుకున్నాడు. అయితే తండ్రి బ్రహ్మాజీ సలహాతో బీఎస్సీ నాటికల్ సైన్స్ పూర్తి చేసి అటుపై యుకేలో మాస్టర్స్ కోర్స్ చేసినప్పటికీ నటన పై ఉన్న అభిరుచి తగ్గక పోవడంతో ఇప్పుడు మళ్ళీ హీరోగా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.


ముంబాయిలో మనోజ్ బాజ్ పాయ్ ఆషిశ్ గాంధీ వంటి ప్రముఖుల్ని ట్రైన్ చేసిన శిక్షకుడి వద్దనే నటన నేర్చుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తనవంతు ప్రయత్నం చేయడానికి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దేవదాసు కనకాల జీవించి ఉన్న రోజులలో డైలాగ్ మాడ్యూలేషన్ విషయంలో ఏడాదిన్నర శిక్షణ తీసుకున్న తర్వాత ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.


బ్యాక్ గ్రౌండ్ ఉంటే అన్నీ ఈజీ అని అందరు అనుకుంటారనీ కానీ అది తప్పుడు ఆలోచన అనీ కామెంట్ చేస్తూ తనకు ప్లస్ 2 నుంచి సాయి ధరమ్ తేజ్ పరిచయం అని చెపుతూ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అతడు పడ్డ కష్టాలు ఏమిటో తాను దగ్గర ఉండి చూసాను అంటూ కామెంట్ చేసాడు. వాస్తవానికి తాను సినిమా అవకాశం కోసం నాలుగేళ్ళు వేచి చూసిన విషయాన్ని బయట పెడుతూ పిట్ట కథ మూవీలో మంచి చేసే యువకుడి పాత్రలో తాను కనిపించబోతున్న విషయాన్ని లీక్ చేసాడు. ఇప్పటికే వారసత్వం హీరోల సంఖ్య పెరిగిపోతున్న పరిస్థితులలో సంజయ్ రావ్ సమర్థత అదృష్టం ఏమిటో ఈవారం తెలుస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: