సునీల్... తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హాస్య నటుల్లో ఒకరు. 2000 తర్వాత సునీల్ లేని సినిమా అంటే బోర్ కొడుతుంది అనే భావన అప్పుడు ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉండేది. ఎన్నో సినిమాలు సునీల్ ని చూసే ఆదేవి. గోదావరి యాస తో అప్పట్లో సునీల్ నటనకు ఎందరో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సునీల్ ని తెర మీద చూస్తే చాలు నవ్వుకునే వాళ్ళు. ఆ రేంజ్ లో సునీల్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. తరుణ్ సినిమా అయినా, బాలకృష్ణ సినిమా అయినా, 

 

జగపతి బాబు సినిమా అయినా సరే సునీల్ లేకుండా ఉండేది కాదు అప్పట్లో. వాళ్ళ సినిమాకు ప్రధాన బలం సునీల్. ముఖ్యంగా కామెడి సన్నివేశాలను దర్శకుడు కేవలం సునీల్ కోసమే రాసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని అంటారు కొందరు. హీరోలతో సమానంగా పారితోషికం తీసుకుని సునీల్ ఒక చరిత్ర సృష్టించాడు. అయితే అనూహ్యంగా సునీల్ కామెడి పాత్రలకు గుడ్ బై చెప్పి హీరో అవతారం ఎత్తడం మైనస్ అయింది. తనకు వచ్చిన బ్రాండ్ ని సునీల్ కాపాడుకోవడంలో దాదాపుగా ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి. చాలా మంది కమెడియన్లు అవకాశాల కోసం వస్తూ...

 

సునీల్ స్థానాన్ని భర్తీ చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకున్నారు అంటే సునీల్ ఏ స్థాయిలో పేరు సంపాది౦చుకున్నాడో అర్ధమవుతుంది. సునీల్ తర్వాత ఇప్పటి వరకు తెలుగులో ఆ రేంజ్ హాస్య నటుడు ప్రేక్షకులకు కనపడలేదు. ఆ తర్వాత చాలా మంది వచ్చినా సరే అలరించి వెళ్ళిపోయారు గాని నిలబడలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ సునీల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అవకాశాలు ఇస్తున్నాడు. మరి ఎంత మేర తన అద్రుష్టం నిలబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: