సినిమా అయిన హిట్ టాక్ తెచ్చుకుంటే దాని సీక్వెల్ గురించి ప్రేక్షకుల నుండి స్పందన రావడం చూస్తుంటాం. ఒక్కోసారి దర్శకులకి సీక్వెల్ తీయాలనే ఆలోచన లేకపోయినా అందరూ అంటున్నారనో, సీక్వెల్ తీయడానికి కథ రెడీ అనుగుణంగా ఉందనో పనులు మొదలు పెట్టేస్తారు. అయితే కొన్ని సార్లు దర్శకుడికి కొత్త కథలు దొరక్క ఆల్రెడీ హిట్ అయిన వాటికి సీక్వెల్స్ తీస్తుంటారు. ఇలాంటి సీక్వెల్స్ ఏమాత్రం ఎక్సైటింగ్ గా ఉండవు.

 

 

ఏదో తీసాం అంటే తీసాం అన్నట్టుగానే ఉంటాయి గానీ వాటిలో జీవం ఉండదు. ప్రేమ కథలని అత్యంత సహజంగా తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తన హిట్ చిత్రమైన ఏ మాయ చేశావే సీక్వెల్ తీయడానికి రెడీగా ఉన్నాడట. 2010 లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అటు తమిళంలోనూ, తెలుగులోనూ సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. తమిళంలో త్రిష, శింబు జంటగా నటించగా, తెలుగులో చైతన్య, సమంతలు జంటగా నటించారు.

 

 


సినిమా సీక్వెల్ గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. గౌతమ్ మీనన్ ఈ సినిమాకి స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడట. శింబు ఓకే అంటే షూటింగ్ మొదలెట్టేస్తాడట. బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమా సీక్వెల్ తీయడం పట్ల అందరికీ ఆసక్తి ఉన్న మాట నిజమే.. కానీ ఈ సినిమాకి సీక్వెల్ అవసరమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సుఖాంతంగా ముగిసిన ఈ చిత్రానికి సీక్వెల్ అంటే మళ్ళీ కావాలని ఏదో కాన్ ఫ్లిక్ట్ పెడితే సినిమా చెడిపోతుందనే వాదిస్తున్నారు.

 

 

 

క్లాసిక్ గా నిలిచిన ఈ చిత్ర కథని సీక్వెల్ అంటూ పాడుచెయ్యడం బాగోదని భావిస్తున్నారు. అయితే గౌతమ్ మీనన్ కథలు చెప్పడంలో ఎక్స్ పర్ట్ అని అందరికీ తెలుసు. ఏ మాయ చేశావే ఫీల్ ని పోగొట్టకుండా తన స్క్రిప్ట్ ని రెడీ చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఏది ఏమైనా సీక్వెల్స్ లాంటి వాటికి వెళ్ళక్పోవడమే మంచిదని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: