మన డార్లింగ్ ప్రభాస్ నాగ్ అశ్విన్ తో సినిమా ఒప్పుకున్నప్పటి నుండి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. అసలు వీరిద్దరికీ ఎలా కుదిరింది. పక్కా క్లాస్ సినిమాలు తీసిన నాగ్ అశ్విన్ కి, పక్కా మాస్ హీరో అయిన ప్రభాస్ కి ఎలా కుదురుతుంది అన్న వాదనలు వస్తూనే ఉన్నాయి. ఒక క్లాస్ దర్శకుడు, మాస్ హీరోని డీల్ చేయగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటన్నింటికీ సమాధానం ఉంది.

 

 

బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానుల కోసమని చెప్పి సాహో సినిమా చేస్తే దాని ఫలితం సరిగ్గా రాలేదు. దాంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు. బాహుబలి లాంటి పెద్ద హిట్ తర్వాత ప్రభాస్ నుండి అలాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. సాహో సినిమా గురించి ప్రభాస్ ముందే ఊహించాడేమో అందుకే తన తర్వాతి చిత్రంగా పీరియాడిక్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. అయితే ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా అతని రేంజ్ చాల పెద్దది.

 

 


ఆ రేంజ్ ని అందుకోవాలంటే యూనికి స్టోరీ కావాలి. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని సినిమాల్ని చేసే సత్తా ప్రభాస్ కి ఉంది. అలాంటి హీరోతో నాగి సినిమా చేయడం అందరికీ ఆసక్తిగా మారింది. మహానటి తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకున్న నాగి కథ రాయడానికి చాలా సమయమే తీసుకున్నాడు. కథ మొత్తం పూర్తయ్యాక ఆ కథలో పాత్ర భారాన్ని మోయగలిగే హీరో ఎవరా అని చూస్తే అతనికి ప్రభాస్ ఒక్కడే కనిపించాడట.

 

 

సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఇప్పటి వరకూ చూడని విధంగా ఉంటుందట. పాన్ వరల్డ్ కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ప్రభాస్ తప్ప మరెవరూ సూట్ అవరనీ, అంతటి భారం మోయగలిగేది ప్రభాస్ ఒక్కడే అని, అందుకే ప్రభాస్ ని ఎంచుకున్నానని చెప్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: