అటు వెండి తెర తో పాటు ఇటు బుల్లితెరను కూడా షేక్ చేస్తున్న కమెడియన్ హైపర్ ఆది. తనదైన కామెడీ పంచ్ లతో... సరికొత్త కామెడీని పంచుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. ప్రస్తుతం జబర్దస్త్ టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించి ఓ వైపు సినిమాలు మరో వైపు బుల్లితెరపై కూడా అదరగొడుతున్నాడు. ఇక జబర్దస్త్ లో అయితే కేవలం హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులు కూడా ఎంతో మంది. ప్రస్తుతం చాలామంది కాస్త రిలాక్సేషన్ కోసం జబర్దస్త్ షో ని చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది స్కిట్ వచ్చింది అంటే పగలబడి నవ్వని  ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి లేదు. 

 

 

 అయితే కేవలం జబర్దస్త్ లోనే కాదు సినిమాల్లో కూడా రైటర్ గా పలు సినిమా కథలను అందించాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ వెండితెరపై కూడా తనదైన  కామెడీ తో  హైపర్ ఆది అదరగొడుతున్నాడు. ముఖ్యంగా హైపర్ ఆది కామెడీ టైమింగ్ కామెడీ పంచులు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయిపోయాయి అని చెప్పాలి. సరికొత్త కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తూ అలరిస్తున్నాడు హైపర్ ఆది. అయితే ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు మరి హైపర్ ఆది జబర్దస్త్ లోకి రావడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు అని చాలా మందికి తెలియదు. 

 

 

జబర్దస్త్ లోకి రావడానికి ఆది చాలా కష్టాలు పడ్డాడు అని చెప్పాలి. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చిన ఆది  ఎన్నో కష్టాల తర్వాత ఈ స్థాయికి చేరాడు. హైపర్ ఆది పుట్టి పెరిగింది అంతా కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గ్రామంలో. నరసింహం శారదా దంపతుల కుమారుడు హైపర్ ఆది. ఆది తల్లిదండ్రులది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం. ఆది  తండ్రిగారు కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడే వారు. ఇక ఎన్నో కష్టాలు పడుతూ బీటెక్ పూర్తి చేసిన అది మంచి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇదే సమయంలో సరదాగా అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్ సీన్  కామెడీగా మార్చేసి ఒక వీడియో  చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయగా దానిని జబర్దస్త్ టీం లీడర్ అదిరే  అభి  చూసి ఆది ని సంప్రదించాడు.. అలా జబర్దస్త్ కంటెస్టెంట్ గా వచ్చిన అది తనను తాను నిలదొక్కుకుని టీం లీడర్ గా ఎదగడానికి ఎంతో కష్టపడ్డాడు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం హైపర్ ఆది కెరియర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: