స్టార్ కమెడియన్ సునీల్ పంచులు, ప్రసాల గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్ గా అలరించి ప్రేక్షకుల మనసులు గెలిచాడు సునీల్. నల్లగా ఉండే సునీల్ సక్సెస్ అవడానికి అతని టాలెంటే ప్రధాన కారణం అయితే సినిమాల్లో సక్సెస్ అవ్వాలంటే అందంతో పనిలేదని మరోసారి ప్రూవ్ చేశాడు సునీల్. ఇక కమెడియన్ గా మంచి ఫాం లో ఉన్న టైం లో అతనికి హీరో అవ్వాలన ఆలోచన వచ్చింది. అది అతనికి సొంతంగా వచ్చిన ఆలోచనా లేక ఎవరైనా సలహా ఇచ్చారో తెలియదు కాని కమెడియన్ గా ఉన్న సునీల్ కాస్త హీరో అయ్యాడు.

 

అందాల రాముడు సినిమాతో హీరోగా ఆకట్టుకున్న్ సునీల్ రాజమౌళి డైరక్షన్ లో మర్యాద రామన్న సినిమా కూడా చేశాడు. ఆ సినిమాతో సునీల్ హీరోగా నిలదొక్కుకున్నాడని అనిపించింది. కాని సునీల్ హీరోగా బ్యాడ్ లక్ వెంటాడింది. హీరోగా సినిమాలైతే చేస్తున్నాడు కాని బాక్సాఫీస్ దగ్గర అవి బొక్క బోర్లా పడుతున్నాయి. అందుకే హీరోగా సినిమాలు ఆపేసి మళ్లీ తనకు ఇంత క్రేజ్ తెచ్చిన కమెడియన్ గానే కొనసాగాలని అనుకున్నాడు సునీల్. కమెడియన్ గా సూపర్ ఎంటర్టైనర్ అయిన సునీల్ హీరోగా మాత్రం సక్సెస్ కాలేదు.

 

కమెడియన్ సునీల్ మళ్లీ తన కామెడీ టైమింగ్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు. హీరో అవడం కోసం తన బాడీ షేప్ ను కూడా మార్చుకున్న సునీల్ ఫైనల్ గా మళ్లీ మునుపటి రూపం తెచ్చుకుని మళ్లీ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. హీరోగా ఎందుకు ఫెయిల్ అవడం కన్నా కమెడియన్ గా మళ్లీ సక్సెస్ అవడం మీద అతని దృష్టి ఉంది. సునీల్ ఇలానే మరెన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: