సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది... మహర్షి లాంటి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి తో మరోసారి సినిమా చేయబోతున్నాడని కన్ఫార్మ్ అయిపోయిన విషయం తెలిసిందే. దీనికోసం వంశీపైడిపల్లి కథ కూడా సిద్ధం చేసుకున్నాడు... ఇంకా మహేష్ ఇండియాకు తిరిగివచ్చాక  సినిమా పట్టాలెక్కపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ మెయిన్ ట్రాక్ లో ఉన్న వంశీ పైడిపల్లి సినిమా కాస్త ప్రస్తుతం సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయింది.

 

 

 వంశీ పైడిపల్లితో మహేష్ సినిమా ఆగిపోయింది. అయితే వంశీ పైడిపల్లి మహేష్ కాంబినేషన్లో తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్న సినిమా... ఆగిపోవడానికి కారణం మహేష్ బాబుకి కథ నచ్చకపోవడం వల్లే అని ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా కథల ఎంపిక విషయంలో మహేష్ బాబు  ఆచితూచి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... వంశీ పైడిపల్లి సినిమా కథ నచ్చకపోవడంతో మహేష్ సినిమా పక్కనపెట్టేశారు  అనే ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవం మరొకటి అని తాజాగా కీలక సమాచారం లీక్ అయింది. నిజానికి అయితే మహేష్ బాబు ఈ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మించాలని భావించారట.

 

 

 అయితే ఇది గ్యాంగ్ స్టార్ కావటంతో పాన్  ఇండియా రేంజ్ లో వర్క్ అవుట్ చేసే ప్లాన్ లో భాగంగా వంశీ పైడిపల్లి కాస్త పెద్ద బడ్జెట్ ని చెప్పాడట. అంత పెద్ద మొత్తాన్ని ఈ సినిమా కోసం బడ్జెట్ గా పెట్టలేను  అని మహేష్ ఓపెన్గా చెప్పేశాడట. దీంతో కాస్త నిరాశ చెందిన వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దిల్ రాజు వద్దకు కూడా వెళ్లాడట. అయితే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి దిల్ రాజు ఓకే చెప్పినప్పటికీ దిల్ రాజుతో బడ్జెట్ షేరింగ్ ఈ విషయంలో మాత్రం మహేష్ సెట్ కాలేదట. మహేష్ దిల్ రాజు మధ్య ఒప్పందం కాస్త సెట్ కాకపోవడంతో నే... ప్రస్తుతం ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడినట్లు సమాచారం.

 

 

అయితే ఈ ప్రాజెక్టు కేవలం కొన్ని రోజుల వరకు మాత్రమే వాయిదా పడిందని త్వరలో మళ్లీ పట్టాలెక్కె  అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ సినిమాని పక్కన పెట్టి ప్రస్తుతం గీతగోవిందం ఫేమ్ పరశురాం సినిమాను పూర్తి చేసేందుకు మహేష్ బాబు నిర్ణయించారు.కానీ దిల్ రాజు కాస్త చొరవ చూపి ఉంటే మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమా సెట్స్పైకి వెళ్లేది  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: