మహేష్ వంశీ పైడిపల్లిల మూవీ క్యాన్సిల్ కావడంతో వంశీ పైడిపల్లి ఈమధ్య రామ్ చరణ్ ను కలిసి తనకు చిరంజీవితో తీయబోయే మళయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' రీమేక్ దర్శకత్వం వహించే అవకాశం ఇమ్మని అడిగినట్లు వార్తలు వచ్చాయి. దీనికి చరణ్ కూడ సానుకూలంగా స్పందించాడు అంటూ లీకులు వచ్చాయి.


అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రాజెక్ట్ ను చిరంజీవి వినాయక్ కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. మొహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'లూసిఫర్' రీమేక్ రీమేక్ రైట్స్ ను చాలారోజుల క్రితం చరణ్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయంపై చాలా రోజులుగా చర్చలు కొనసాగుతున్న పరిస్థితులలో ఈమధ్య వంశీ పైడిపల్లి పేరు కూడ బయటకు వచ్చింది. 


ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని శాసించే స్థాయిలో ఈమూవీలో హీరో పాత్ర ఉంటుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ఇప్పటికే దర్శకుడు సుకుమార్ మార్పులు చేసి స్క్రీన్ ప్లే వ్రాసి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు చిరంజీవి మనసు వివి వినాయక్ పై మళ్ళిందని అంటున్నారు. గతంలో చిరంజీవితో ‘ఠాగూర్’ ‘ఖైది నెంబర్150’ చిత్రాలకు వినాయక్ దర్శకత్వం వహించి సూపర్ హిట్ ఇచ్చిన నేపధ్యంలో ఆ సెంటిమెంట్ తనకు బాగా కలిసి వస్తుందని చిరంజీవి నమ్ముతున్నట్లు టాక్. 


అయితే వినాయక్ ఎంపిక పై మెగా కాంపౌండ్ లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏమాత్రం క్రేజ్ లేని ఈ దర్శకుడుకి ఈ ప్రాజెక్ట్ అప్పగించడం మంచిది కాదని చిరంజీవి సన్నిహితులు అతడికి సూచించినట్లు టాక్. దీనితో ఈ మూవీ ప్రాజెక్ట్ వినాయక్ చేతికి వస్తుందో లేదో తెలియకపోయినా వంశీ పైడిపల్లికి మాత్రం మరో ఊహించని షాక్ అంటున్నారు. ప్రస్తుతం టాప్ హీరో ఎవరు అందుబాటులో లేని పరిస్థితులలో వంశీ పరిస్థితి అయోమయంలో పడిపోయింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: