రేలంగిగా పేరు గాంచిన రేలంగి వెంక‌ట‌రామ‌య్య ప‌ద్మ‌శ్రీ అవార్డు పొందిన మొద‌టి హాస్య న‌టుడు. తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ స‌మీపంలోని ర‌వుల‌పాడు అనే గ్రామంలో జ‌న్మించారు. తండ్రి హ‌రి క‌థ సంగీతం నేర్పించేవారు. చిన్న త‌నంలో త‌ల్లిద‌గ్గ‌ర విద్య‌లు నేర్చుకున్నారు. బాల్యం అంతా కూడా ఎక్కువ‌శాతం రావుపాడు కాకినాడ‌లోనే జ‌రిగింది. చ‌దువుకునే వ‌య‌సు నుంచే నాట‌కాలు వేయ‌డం ప్రారంభించారు.రేలంగిని సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది ద‌ర్శ‌కుడు సి. పుల్ల‌య్య 1935లోనే సినిమాల్లో ప్ర‌వేశించినా 48 వ‌ర‌కు కూడా చెప్పుకోద‌గ్గ గుర్తింపు రాలేదు. ఈ స‌మ‌యంలో పుల్ల‌య్య ద‌ర్గ‌గ‌ర సినీ నిర్మాణం గురించి ప‌లు శాఖ‌ల్లో ప‌నిచేశారు. 1948లో వింధ్యారాణి చిత్రంతో ఆయ‌న కెరియ‌ర్ విజ‌యాల బాట ప‌ట్టింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన కీలుగుర్రం, గుణ‌సుంద‌రి, పాతాళ‌భైర‌వి, పెద్ద‌మ‌నుషులు, మాయాబ‌జార్‌,  వంటి విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించ‌డం తో ఆయ‌న దాదాపు నాలుగు ద‌శాబ్ధాల‌కు పైగా 300 పై చిత్రాల్లో న‌టించారు. న‌టుడిగా తారా స్థాయిని అందుకున్న రేలంగి ప‌లు స‌న్మానాలు, పుర‌స్కారాలు అందుకున్నారు.

 

 1970లో భార‌త్‌ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ‌పుర‌స్కారం ఇచ్చింది. తాడేప‌ల్లిగూడెంలో ఆయ‌న పేరుతో ఒక థియేట‌ర్‌ని కూడా నిర్మించారు. రేలంగి చిట్టిచెల్లి చిత్రం 1970లో వ‌చ్చిన పూజ‌. చివ‌రిద‌శ‌లో తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డిన రేలంగి 1975లో తాడేప‌ల్లిగూడెంలో గుండెపోటు వ‌చ్చి మ‌ర‌ణించారు. రేలంగి వెంక‌ట‌రామ‌య్య తూర్పుగోదావ‌రి జిల్లాలో ఆగ‌స్టు 1910లో జ‌న్మించారు. గ‌వ‌ర కులానికి చెందిన రేలంగి న‌ర‌సింహులు ఆప్‌కారి వ్యాపారం చేసేవారు. రేలంగి తండ్రికి మాత్రం వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తి పెద్ద‌గా ఏమీ లేదు. రేలంగితండ్రి  ఓ పాఠ‌శాల‌లో సంగీత మాస్ట‌ర్‌గా ప‌నిచేస్తూ హ‌రిక‌థ‌లు సంగీతం నేర్పించేవారు. అందుక‌ని ఆయ‌న‌ను అప్ప‌ట్లో దాసు అని త‌ర్వాత రామ‌దాసు అని పిల‌వ‌డం ప్రారంభించారు. త‌ల్లి అచ్చ‌మ్మ వీరికి వెంట‌రామ‌య్య ఒక్క‌రే సంతానం. 

 

ఆమె రేలంగి మూడు సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే మ‌ర‌ణించింది. రేలంగి చిన్న‌త‌నం నుంచి కూడా త‌న తండ్రి ద‌గ్గ‌ర సంగీతం హ‌రిక‌థ‌లు నేర్చుకుంటూ ఉండేవారు. నెమ్మ‌దిగా అత‌ని దృష్టి నాట‌క‌రంగం వైపు మ‌ళ్లింది. దాంతో చ‌దువు స‌జావుగా సాగ‌లేదు. రేలంగి చ‌దువు నాలుగో ఫారంలోనే ఆగిపోయింది. రేలంగి తండ్రికి తెలియ‌కుండా నాట‌కాల్లో పాల్గొన‌డం మొద‌లు పెట్టారు. మొద‌టి సారి ఆయ‌న స్త్రీ పాత్ర‌లో న‌టించాడు. విష‌యం తెలిసి తండ్రి తీవ్రంగా మంద‌లించారు కానీ రేలంగిని మాత్రం న‌ట‌న‌కి దూరం చెయ్య‌లేక‌పోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: