చలన చిత్ర రంగంలో ఒక్క మెరుపు మెరిసి చివర్లో దుర్భరమైన జీవితం అనుభవించిన వారు ఎంతోమంది ఉన్నారు.  నటులుగా ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వారి జీవితంలో వెలుగు ఎలా ఉంటుందో చీకటి అలాగే ఉంటుంది. తెరపై కనిపించిన ఆనందం తెర వెనుక ఉండదన్న విషయం పలు సంఘటనలు నిరూపించాయి.  ఒకప్పుడు సినీ పరిశ్రమంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శక, నిర్మాతలు, కమెడియన్లు ఎంతో మంది తమ ఆఖరి క్షణంలో ఎన్నో కష్టాలు అనుభవించారని చాలా సార్లు వార్తలు చదివాం.  మహానటిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించి.. ఆమెను ఒక్కసారి చూస్తే చాలు.. మాట్లాడితే చాలు అనే అభిమానులును సంపాదించిన నటి సావిత్రి చివరి దశలో ఒక చిన్న గదిలో ప్రాణాలు విడిచారు. నవ్వుల రేడు.. రాజబాబు సైతం చివరి దశలో ఇబ్బందులు పడ్డారని టాక్.  ఒకప్పుడు చిత్తూరు నాగయ్య అంటే ఎంత గొప్పగా చెప్పుకునే వారో.. ఆయన కూడా అవసాన దశలో ఎన్నో అగచాట్లు పడ్డారట. 

 

ఇలా సినీ పరిశ్రమంలో సత్తా చాటిన వారు జీవితం చివరి దశలో ఇబ్బందులు పడ్డారట.  తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది రేలంగి, పద్మనాభం,రాజబాబు ఒకప్పుడు వీళ్ల డిమాండ్ దాదాపు హీరో స్థాయిలో ఉండేదట. రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉండేదని టాక్.  పద్మనాభం కేవలం నటుడు మాత్రమే కాదు మల్టీటాలెంటెడ్ పర్సన్ అంటారు.  నిర్మాత, దర్శకుడు, రచయిత,సింగర్, ఇలా ఎన్నో కళలు ఆయనలో దాగి ఉన్నాయి.  ఆయన హిట్ చిత్రాలు తీశారు.. దారుణమైన ఫ్లాప్ చిత్రాలు తీశారు.  తన హస్యంతో తెలుగువారిని అలరించిన పద్మనాభం 1931, ఆగస్టు 20న కడప జిల్లాలోని సింహాద్రిపురంలో జన్మించారు. పద్మనాభం పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. పద్మనాభం తండ్రి ఆ ఊరి కరణంగా పనిచేసేవారు. పద్మనాభం  చిన్నతనం నుంచి పద్యాలన్నా, సంగీతమన్నా, నటన చాలా ఆసక్తి కనబరిచేవారు.

 

ఐదేళ్ల వయస్సులోనే చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం ధరించి ఊరి వాళ్ల చేత శభాష్ అనిపించుకున్నారు. చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో తన తమ్ముడు తేలు కుట్టి చనిపోయాడు. ఆయన చెల్లెలు జబ్బు తో మరణించింది..దాంతో నైరాశ్యంలో పద్మనాభం కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు.  పెళ్లి చేసిచూడు, చంద్రహారం, కృష్ణ ప్రేమ, సతీ సుకన్య, వంటి ఎన్నో చిత్రాలలో మంచి పేరు సంపాదించారు. దేవత, పొట్టి ప్లీడరు, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రాలను నిర్మించారు. అలాగే శ్రీరామ కథ ను తన స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. చక్రం చిత్రం  సమయంలో ఆయన ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి.  అందులో జగమంత కుటుంబ నాది అనే పాట లో ఆయన జీవితం గురించి చెప్పినట్లు ఉందని టాక్ వినిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: