వెన్నెల కిషోర్ ఎంతో చక్కగా నటిస్తూ, నవ్వించే హాస్య నటుడు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు కిషోర్. సినీ పరిశ్రమ లో తన ప్రవేశం కొంచెం విచిత్రం. వెన్నెల కిషోర్ అమెరికా లో మాస్టర్స్ పూర్తి చేసాడు. ఆ తర్వాత తను ధామస్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు.
 
 
IHG
 
ఇలా అక్కడ తను పని చేస్తూ సరదాగా దర్శకుడు దేవ కట్టా తో సహాయకుడిగా పని చేసాడు వెన్నెల కిషోర్. అప్పుడు శివారెడ్డి పాత్రలో నటించాల్సి వచ్చింది వెన్నెల కిషోర్ కి. ఇలా సెలవల్లో నటన పై దృష్టి పెట్టాడు కిషోర్. ఇలా తన కెరీర్ని ప్రారంభించాడు వెన్నెల కిషోర్.
 
 
ఖాదర్ పాత్రలో మొదట వెన్నెల కిషోర్ నటించిన తర్వాత ఇందుమతి, సమర్ధుడు, కరెంట్, బిందాస్ ఇలా ఎన్నో చిత్రాలలో నటించాడు ఈ హాస్య నటుడు. ముద్దుకృష్ణ పాత్రతో బిందాస్ లో మంచి హాస్యాన్నిచ్చాడు వెన్నెల. అలానే ఇంకొకసారి చిత్రానికి నంది ఉత్తమ హాస్య నటుడు పురస్కారాన్ని అందుకున్నాడు. చక్రి, స్నేహగీతం, ఆరెంజ్, ఏమైంది ఈ వేళ, వారెవ్వా, తిమ్మరాజు, దరువు, జులాయి, సుప్రీం, ఛలో ఇలా అనేక సినిమాల్లో హాస్యాన్ని పండించాడు కిషోర్. 
 
IHG
 
 
స్టాలిన్ సినిమాలో మొదట అవకాశం వచ్చింది. కానీ ఆఫీస్ లో సెలవలు లేని కారణంగా ఆ అవకాశాన్ని వదిలేసుకున్నాడు వెన్నెల కిషోర్. ఆ తర్వాత మొదట అపజయాలని ఎదుర్కొన్నా తర్వాత అనేక సినిమాల్లో కిషోర్ మంచి పేరుని దక్కించుకున్నాడు. తన నటనతో  ఆకట్టుకుంటూ మంచి హాస్యంతో నవ్విస్తాడు కిషోర్. ఇలా కిషోర్ తన సినీ కెరీర్ లో చక్కటి స్థానాన్ని దక్కించుకుంటున్నాడు.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: