ఇ.వి.విగా ప్రసిద్ధిచెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ.. తెలుగు ప్రేక్షకుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. నవతరం హాస్యానికి పట్టం కట్టిన ఈయ‌న గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అనిపిస్తుంది. సినీ సీమలో చేరాలన్న ఒకే ఒక కోరికతో వచ్చిన ఈవీవీ ఆదిలో ఎన్నో కష్టాలు అనుభవించారు. దేవదాసు కనకాల పరిచయంతో నవతా కృష్ణంరాజు ప్రోత్సాహంతో ఓ ఇంటి భాగోతం చిత్రంలో సహాయ దర్శకుడిగా ఈవీవీ చేరారు. ఆ తర్వాత హాస్య బ్రహ్మ జంధ్యాల దగ్గర సహాయ దర్శకుడిగా 8 సంవత్సరాలు చేశారు. 

 

ఈయ‌న‌ మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నిర్మింపబడిన చెవిలో పువ్వు. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. అయితే ఆ త‌ర్వాత నిర్మాత రామానాయుడు ప్రేమఖైదీ చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం మంచి విజయం సాధించ‌డంలో ప‌లు ఆక‌శాలు ద‌క్కించుకుంటూ దూసుకుపోయారు. ఆ కాలంలోనే నాలుగు స్థంభాలాట, రెండు జిల్లా సీత, నెలవంక, అహ ...నా పెళ్ళంట, హాయ్ హాయ్ నాయక లాంటి చిత్రాల్లో పని చేయడంతో... చిత్రాల్లో హాస్యం పై ఈవీవీ కి పట్టు కుదిరింది. ఆ పట్టే ఆయన చిత్రాల్లో హాస్య ముద్రను వేసింది. ఈవీవీ చిత్రాల ద్వారా ఎంద‌రో హాస్య న‌టుల‌ను వెండి తెరకు ప‌ర‌చ‌య‌మయ్యారు.

 

ఒక దశలో ఆయన దర్శకత్వంలో వరుసగా దాదాపు ప‌ది హిట్‌ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ తదితర అగ్ర హీరోలతో కూడా విజయవంతమైన సినిమాలు తీశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కుమారులు ఆర్యన్‌ రాజేశ్‌, అల్లరి నరేశ్‌ల‌ను సినిమా రంగంలోకి తీసుకువ‌చ్చి.. వాళ్ల‌తో కూడా సినిమాలు చేసి హిట్ అయ్యాడు. కామెడీ సినిమాల‌కు ఇ.వి.వి పెట్టింది పేరు. ఈవీవీ సినిమా అంటూ ఒక శైలితో, ఒక ప్రత్యేకమైన ఒరవడితో వీక్షకుల హృదయసీమల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ఆయన నిర్మాతలకు కానక వర్షం కురిపించే కమర్షియల్ దర్శకుడు. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకు ఆనంద క్షణాల్ని అందించే కళాకారుడు. ఎంద‌రో క‌మెడియ‌న్ల‌కు జీవితాన్ని ఇచ్చిన మ‌హానుభావుడు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: