తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున వారసులుగా నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  నాగ చైతన్య ‘జోష్’ చిత్రంతో పదేళ్ల క్రితం హీరోగా పరిచయం అయ్యాడు.  మనం చిత్రంలో మూడు తరాల నటులు నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో క్లయిమాక్స్ లో మెరుపులా మెరిశాడు అక్కినేని అఖిల్.  మంచి హైట్ పర్సనాలిటీతో అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. వాస్తవానికి అఖిల్ చిన్న తనంలోనే ‘సిసింద్రి’ చిత్రంతో పరిచయం అయ్యాడు. మాస్ దర్శకుడు వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు అఖిల్ అక్కినేని.  ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాకున్నా అఖిల్ కి మాత్రం డ్యాన్స్, యాక్షన్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. 

 

ఈ చిత్రం తర్వాత అఖిల్ కి మంచి భవిష్యత్ ఉంటుందని భావించారు.  అయితే రెండో చిత్రం హలో కూడా తుస్ మన్నది.  తర్వాత మిస్టర్ మజ్ను కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  ఇలా వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో ఈసారి మంచి హిట్ తో రావాలని సిద్దం అవుతున్నాడు. అఖిల్ హీరోగా   'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రం రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు.  గతంలో సిద్దార్థకు బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన విషయం తెలిసిందే. 

 

గుండెలకు హత్తుకునే ప్రేమ కథతో ఆయన తీసే చిత్రాలపై మంచి క్రేజ్ ఉంది   తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు. "మనసా మనసా మనసారా బ్రతిమాలా .. తన వలలో పడబోకే మనసా .. " సాగుతున్న ఈ సాంగ్ ఎంతో ప్రశాంతంగా హృదయానికి వినసొంపులాా ఉంది. గోపీసుందర్ సంగీతం .. సురేంద్ర కృష్ణ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఈ మద్య సిద్ శ్రీరామ్ పాడుతున్న పాటలకు ఎంత క్రేజ్ వస్తుందో ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: