పూరి జగన్నాథ్ రూపొందించిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మరి కొద్ది గంటలలో పూరీ జగన్నాద్ ‘హార్ట్ ఎటాక్’ రిజల్ట్ రాబోతోంది. గత కొద్ది కాలంగా పరాజయాల బాటలో ఉన్న పూరీకి ఈ చిత్రం జయాపజయాలు అతడి కెరియర్ పై తీవ్ర పభావాన్ని చూపించనున్నాయి. అయితే పూరీకి మార్కెట్లో ఉన్న పేరు మరియు నితిన్ కు ప్రస్తుతం నడుస్తున్న క్రేజ్ రీత్యా ఈ సినిమా విడుదల కాకుండానే పూరీకి లాభాల బాటలో పడింది అంటున్నారు. ఎపిహెరాల్డ్ కు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం విడుదలకు ముందే లాబాల బాటలో నితిన్ హీరోగా అదాశర్మ జంటగా నటించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఏడు కోట్లు లాభంలో ఉందని సమాచారం. పూరీ జగన్నాథ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈ చిత్రం బిజినెస్ చేసారని,అందులోనూ ట్రైలర్స్,పోస్టర్స్ కు మంచి క్రేజ్ రావటం,నితిన్ మార్కెట్ బాగుండటంతో రిలీజ్ కు ముందే బిజినెస్ పరంగా హిట్ అయ్యింది. ట్రేడ్ లో వినపడుతున్న లెక్కలు ప్రకారం ఈ చిత్రం బడ్జెట్ 14 కోట్లు. అయితే మొత్తం బిజినెస్ శాటిలైట్,ఓవర్ సీస్,డిస్ట్రిబ్యూషన్ రైట్స్,ఆడియో అన్ని కలిపి 21 కోట్లు వ్యాపారం నడిచింది. జెమెనీ ఛానెల్ వారు నాలుగున్నర కోట్లు పెట్టి శాటిలైట్ రైట్స్ రైట్స్ తీసుకున్నారు. థియోటరకల్ రైట్స్ నిమిత్తం 16.5 కోట్లు, నైజం ఆరు కోట్లు, సీడెడ్ 2.5 కోట్లు, మిగతా ఏరియాల నుంచి 8 కోట్లు వచ్చింది అని అంటున్నారు.  దానితో నిర్మాత లాభాలతో, పూరీ జగన్నాథ్ ఒడ్డున పడినట్లే అని చెప్తున్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ఇది నేను చాలా రోజుల తర్వాత రూపొందించిన ప్రేమ కథాచిత్రం. ఏ లవ్‌స్టోరీకైనా సంగీతం కీలకమవుతుంది. అనూప్ అద్భుతమైన బాణీలతో అదరగొట్టాడు అని అంటున్నారు. పూరి జగన్నాథ్ తరహాలో రూపొందిన ఈ అందమైన ప్రేమకథలో నటించడం ఆనందంగా ఉందనీ హీరో నితిన్ అంటున్నాడు. ఈ చిత్రంలో తన పాత్ర వినోదాన్ని పంచుతూనే చక్కని సందేశాన్ని ఇచ్చేదిగా ఉంటుందని బ్రహ్మానందం తెలిపాడు. నితిన్, అనూప్ కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' మంచి హిట్టయ్యాయనీ, ఇది వారికి హ్యాట్రిక్ ఫిల్మ్ అనీ అలీ అన్నాడు. ఇలాంటి చక్కని లవ్‌స్టోరీకి సంగీతాన్నివ్వడం సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉందని అదాశర్మ తెలిపింది. పూరీ అంచనాల ప్రకారం ఈ సినిమా యూత్ లో హిట్ టాక్ తెచ్చుకుంటే పూరీ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందినట్లే అని అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: