కోవై సరళ ఎన్నో మంచి సినిమాలలో నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హాస్య నాటిక మంచి స్థానాన్ని దక్కించుకుంది. బెస్ట్ కమిడియన్గా అనేక అవార్డుని పొందింది. అటు తమిళ్ లోను ఇటు తెలుగులోను అనేక సినిమాలలో నటించింది. మంచి హాస్యాన్ని పండించి తెలుగులో కామిడీయన్ గా చక్కటి స్థానాన్ని పొందింది.

 

IHG

 

 

 

హాస్య నటిగా కోవై సరళ ఎంతగానో ప్రేక్షకులని మెప్పించింది. అయితే బ్రహ్మానందంతో చేసిన సినిమాలు నిజంగా ఎంతో హాస్యంగా ఉంటాయి. ఆమె తొమ్మిదవ తరగతి లో ఉన్నప్పుడే సినిమాలలో అవకాశం లభించింది. ఆమె పడవ తరగతిలో ఉన్నప్పుడే గర్భిణీ స్త్రీగా నటించింది. మొత్తం 250 సినిమాలలో నటించింది తెలుగు తమిళం లో కలిసి. కన్నడ, మలయాళంలో కూడా కోవై సరళ పలు సినిమాలలో నటించింది.   . 

 

1992 లో కోవై సరళ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయినది. పెళ్ళాం చెప్తే వినాలి, కుంతి పుత్రుడు, భైరవ దీపం, పెళ్ళి, సుప్రభాతం, సింహరాశి, నువ్వే కావాలి , మృగరాజు, మళ్ళీ మళ్ళీ చూడాలి, హనుమాన్ జంక్షన్, సందడే సందడి, ఎలా చెప్పను, స్టైల్, రామ్, రాజబాబు, దేశముదురు, హీరో, పులి, రెబల్ ఇలా అనేక సినిమాలలో నటించి చక్కటి హాస్యాన్ని పండించింది కోవై సరళ.

 

IHG

 

హాస్య నటిగా, యాక్టర్గా, రాజకీయ నాయకురాలిగా కోవై సరళ చక్కటి అభిమానము సొంతం చేసుకుంది. కోవై సరళ పెళ్ళి చేసుకోలేదు. కానీ సరళ తన చుట్టాల పిల్లల్ని చూసుకుంటూ ఉండేది.  బ్రహ్మానందంతో కలిసి చేసిన సినిమాలు నిజంగా చెప్పుకో దగినవి.  ఆమె  విభిన్న పాత్రలు పోషించి ఎంతో నవ్వించిన హాస్య నటి. ఎంతో గొప్ప ఆదరణ పొందిన నటి. ఆమె సన్నివేశాలని కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. తిడుతూ పరిగెడుతూ గోల చేసిన సినిమాలు ఎన్నో. ఇలా కోవై సరళ మంచి సినిమాలతో మంచి స్థానం దక్కించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: