సదరన్ స్పైస్ గా దక్షిణాది భాషలకు చెందిన సినిమాల పాటలు వచ్చే ఈ చానెల్ లో వీజేగా పాపులరైన వీజే పూజా రామచంద్రన్. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో కూడా నటించిన ఈ భామ ఆమధ్య తెలుగు సినిమాల్లో విలన్ గా నటించే జాన్ కొకెన్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. ప్రస్తుతం భర్తతో కలసి వెకేషన్ లో ఉంది. మాల్దీవుల్లోని అందమైన బీచ్ ల్లో వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

వీరి వెకేషన్ లో పూజా రామచంద్రన్ మత్తెక్కించే బికినీలో మెరిసిపోతోంది. సెక్సీ బాడీ షేప్ లో ఉన్న పూజా రామచంద్రన్ ఫుల్ బ్లాక్ బికినీ వేసి మత్తెక్కిస్తోందని చెప్పాలి. అసలే బొద్దుగా ఉండే ఈ అమ్మడు ఫుల్ టైట్ బికినీలో మరింత సెక్సీగా కనిపిస్తోంది. మంచి శరీర సౌష్టవంతో జాన్, సెక్సీ బాడీలో పూజ రామచంద్రన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్ లో హాట్ పిక్ గా మారింది. రామ్ చరణ్ ఎవడు సినిమాతో సహా పలు సినిమాల్లో నటించాడు జాన్. స్వామి రారా, దోచెయ్, వెంకీ మామ, ఎంత మంచివాడవురా.. వంటి సినిమాల్లో నటించింది పూజ రామచంద్రన్.

 

 

తెలుగు బిగ్ బాస్ సీజన్2 లో పూజ్ రామచంద్రన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది కూడా. జాన్ కొకెన్ తో ఆమకు ఇది రెండో వివాహం. సహచర వీజే క్రెయిగ్ ను పదేళ్ల క్రితమే వివాహం చేసుకున్న పూజ ఏడేళ్ల వివాహబంధం అనంతరం విడిపోయింది. గత ఏడాది జాన్ ను వివాహం చేసుకుంది పూజ. పూజ మళయాళీ కాగా.. జాన్ కొకెన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: