దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అదిలాబాద్ జిల్లాలోని గిరిజన నాయకుడు కొమరం భీం... తూర్పు గోదావరి జిల్లా రంప‌చోడ‌వ‌రం మ‌న్యంలో గిరిజనుల కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు ఇద్దరూ కలిసి ఒకేసారి పోరాటం చేస్తే ఎలా ? ఉంటుంది అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఓ పెద్ద సందేహం వచ్చి పడింది.



ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ కలుస్తారా లేదా అనే అనుమానం ప్రేక్షకులలో ఉంది. ఎందుకంటే చరిత్ర పరంగా భిన్న ప్రాంతాలు నేపధ్యాలు కలిగిన భీమ్, అల్లూరి కలిసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రిని రాజ‌మౌళి ఎలా క‌లుపుతాడు ? అన్న సందేహ‌మే అంద‌రికి ఉంది. వీరిద్ద‌రు ఒకేసారి తెర‌మీద ఎప్పుడు క‌నిపిస్తారు ? అన్న ఉత్కంఠ ప్ర‌తి ఒక్కరిలోనూ ఉంది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి లీక్ అవుతోన్న మ్యాట‌ర్ ప్ర‌కారం వీరిద్దరూ కలవడానికి ఒక పాయింట్ ఉంది. అల్లూరి, కొమురం భీమ్ కొన్నాళ్లు ఎవరికీ కనిపించలేదట. ఆ సమయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అనేది ఎవరికీ తెలియదు.



మ‌రి ఆ టైంలో వీళ్లు క‌లుసుకున్న‌ట్టు చూప‌తారా ?  అన్న‌ది ఒక డౌట్‌. అయితే ముందుగా సినిమాలో ఎవ‌రికి వారుగా బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తార‌ట‌. ఆ టైంలో ఈ ఇద్ద‌రి పోరాటాలో వేర్వేరుగా జ‌రుగుతాయి. ఇక కీల‌క‌మైన టైంలో వీరిద్ద‌రు క‌లుసుకుని బ్రిటీష‌ర్ల‌పై పోరాటం చేసేలా రాజ‌మౌళి సీన్ క్రియేట్ చేశాడ‌ట‌. ఆ టైంలో వ‌చ్చే యాక్ష‌న్ సీన్లు అదిరిపోతాయ‌ని తెలుస్తోంది. వీరిద్ద‌రు ఒకేసారి మాంచి యాక్ష‌న్ మూమెంట్‌లో క‌న‌ప‌డితే ఇక సినిమా చూసే ప్రేక్ష‌కులు ఏ రేంజ్‌లో పూన‌కాల‌తో ఊగిపోతారో తెలిసిందే. మ‌రి ఈ అద్భుత ఘ‌ట్టం జ‌న‌వ‌రి 8న మ‌న‌కు క‌నువిందు కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: