సినిమా ఇండ‌స్ట్రీ అనే రంగులో ప్ర‌పంచంలోకి ఎంద‌రో న‌టులు అడుగుపెడ‌తారు. అలాగే సినీ తారలు రాజకీయాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.. ప‌రీక్షించుకున్నారు. దక్షిణాది నుంచి ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులయ్యారు. వారి బాటలోనే చాలా మంది నటీనటులు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగి రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. అయితే కొంద‌రు క‌మెడియ‌న్లూ రాజ‌కీయాల్లో తాము ఏ మాత్రం తీసిపోమ‌ని స‌త్తా చాటారు. అందులో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌,  పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్ పేరు ముఖ్యంగా వినిపిస్తాయి.

 

కోట శ్రీనివాసరావు.. ఈ పేరు విన‌గానే అద్భుత‌మైన ఆయ‌న న‌ట‌నే ముందుగా గుర్తుకు వ‌స్తుంది. కోట శ్రీనివాసరావు డైలాగ్‌లోనూ, నటనలోనూ తనదైన ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్నాడు. ఇప్పటికే దాదాపు 500 పైగా సినిమాలు చేశాడీయ‌న‌. ఆయ‌న విల‌నిజం పాత్ర‌లైనా.. కామెడీ పాత్ర‌లైనా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి. నటనలో ఎవరెస్ట్‌ ఆయన. మాకు కోట ఉన్నాడని తెలుగు చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు గర్వంగా చెప్పుకొనే స్థాయి ఆయనది. బాల్యం నుంచే నాటకాలపై ఆసక్తి మెండుగా ఉన్న ఆయన ‘ప్రాణం ఖరీదు’తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత వరుసగా ఆయనకి సినిమా అవకాశాలు రావడంతో మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు.

 

అలాగే రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టిన కోట 1999లో బీజేపీ త‌ర‌పున‌ విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక బాబుమోహ‌న్‌.. క‌మెడియ‌న్‌గా వెండి తెర‌పై మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న‌ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజక వర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 

 

2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందడు. మ‌రియు 2019 లో బీజేపీ లో చేరి ఆందోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటి చేసి ఓడిపోయాడు. ఇక పృథ్వీ రాజ్ మ‌రియు పోసాని కృష్ణ మురళి వీరిద్ద‌రు కూడా వెండి తెర క‌మెడియ‌న్స్‌గా మంచి పేరు సంపాధించుకున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ వైసీపీ నేత‌లుగా కొన‌సాగుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు వీరిద్ద‌రూ వైసీపీ గెల‌వ‌డానికి బాగా స‌హ‌క‌రించారు. అలాగే పృథ్వీ మొన్న‌టి వ‌ర‌కు టీటీడీ  ఎస్వీబీసీ ఛైర్మ‌న్‌గా ప‌నిచేశారు. అయిటే ఇటీవ‌ల కొన్ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆ ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: