క్రేజీ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ మేకోవర్ చూపిస్తున్నాడు. చెప్పాలంటే రౌడీ హీరో పూరీ మార్క్ హీరోగా మారిపోయాడు.  పక్కా మాసీగా రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు. అనుకున్నట్టుగానే డాషింగ్ డైరెక్టర్ విజయ్ దేవరకొండను మరో లెవల్ లో చూపించబోతున్నాడు. 


అర్జున్ రెడ్డి క్యారెక్టర్ విజయ్ దేవరకొండపై బలంగా పడింది. ఎంత బలంగా పడిందంటే ఈ విజయ్ తో సినిమా చేసే డైరెక్టర్స్ అర్జున్ రెడ్డి మ్యానియా క్రాస్ చేయలేకపోయారు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో అర్జున్ రెడ్డి ఛాయలు స్పష్టంగా కనిపించాయి. కానీ ఇప్పుడు అర్జున్ రెడ్డిని మరిచిపోయేలా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విజయ్ ని మరో లెవల్ లో చూపించబోతున్నాడట. 


ఫైటర్ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు లీకయ్యాయి. విజయ్ బైక్ రైడ్ చేస్తుంటే అనన్య పాండే బైక్ పై కూర్చున్న స్టిల్ బయటికొచ్చింది. ఈ స్టిల్ చూస్తుంటేనే ఈ యంగ్ జోడి రైడింగ్ అదరగొట్టారని అర్థమవుతోంది. బైక్ రేసింగ్ లో భాగంగానే రౌడీ హీరో చేలరేగిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఫోటోలో అనన్య సంథింగ్ స్పెషల్ గా హాట్ గా కనిపించింది.

 

విజయ్ పక్కా మాసీగా రఫ్ అండ్ ఠఫ్ గా కనిపిస్తున్నాడు. ఒక రకంగా ఇది పూరీ జగన్నాథ్  మార్క్ ఫోజు అనే చెప్పాలి. ఏ హీరోనైనా తన స్టైల్ లోకి మార్చేయడం పూరీ స్పెషాలిటి. ఇప్పుడు రౌడీని కూడా పూర్తిగా మార్చేశాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ లాంగ్ హెయిర్ పెంచాడు. స్టిల్ చూస్తుంటే విజయ్ ని పూరీ నెక్ట్స్ లెవల్ లో చూపిస్తున్నట్టు అర్ధమవుతోంది. ఈ చిత్రానికి లైగర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.మొత్తానికి విజయ్ దేవరకొండ ఏం చేసినా ఇపుడు సెన్సేషనే అవుతోంది. ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఫుల్ గా ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ రౌడీహీరో మెలుగుతూ.. యూత్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: