దగ్గుబాటి రానా.. ఈ పేరు వింటే బాహుబలి లో భీభత్సమైన విలనీజంతో భళ్లాలదేవుడు గుర్తుకు వస్తాడు.  రాజమౌళి తెరకెక్కించి ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ - రానా నువ్వా అంటే నువ్వా అనుకునే స్థాయిలో నటించి మెప్పించారు.  స్టార్ ప్రొడ్యూసర్స్.. హీరో ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా ‘లీడర్’ తో తన ప్రస్థానం మొందలు పెట్టాడు.  ఈ చిత్రం తర్వాత రానా నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు. కానీ రానా ఎప్పుడు తాను హీరో పాత్రలపైనే ఫోకస్ చేస్తానని అనలేదు.. తనకు ఎలాంటి పాత్రలు వచ్చినా.. చేయడానికి సిద్దం కావడంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించాడు.

 

దగ్గుబాటి రానా ప్రస్తుతం హాతీ మేరీ సాతి, విరాట పర్వం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్వరలో తేజ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.  ఇండస్ట్రీలోకి రానా అడుగు పెట్టి అప్పుడే పదేళ్లు అయ్యింది.  ఈ సందర్బంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కుటుంబంలో అందరూ బాగా చదువుకున్న వారేనని, తండ్రి సురేశ్ బాబు మెకానికల్ ఇంజినీరింగ్ చదివారని, బాబాయి వెంకటేశ్ ఫారిన్ లో ఎంబీఏ చదివారని వెల్లడించారు. తాను మాత్రం టెన్త్ ఫెయిల్ అంటూ నిజాయతీగా చెప్పారు. తనకు మొదట్లో ఎలాంటి లక్ష్యం లేదని.. కాకపోతే ఇండస్ట్రీ వైపు మాత్రం కాస్త ఆశ ఉండేదని అన్నారు. 

 

చిన్న నాటి స్నేహితులు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తనలో ఒక లక్ష్యం ఏర్పడిందని అన్నారు. సినిమాయే జీవితం అని అర్థం చేసుకుని మొదట గ్రాఫిక్స్ విభాగంలో ప్రవేశించి 85 సినిమాలకు పనిచేశానని, సైనికుడు చిత్రంలో వీఎఫ్ఎక్స్ కు గాను నంది అవార్డు కూడా అందుకున్నానని తెలిపారు.  ఇక ఇండస్ట్రీ వైపు అడుగు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత నటనలో శిక్షణ తీసుకున్నానని అన్నారు.  ఎలాంటి పాత్రైనా దానికి న్యాయం చేస్తున్నామా అన్న విషయంపైనే ఫోకస్ చేస్తానని అన్నారు. ఇప్పటి వరకు తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: